Mojtaba Khamenei : ఇరాన్ సుప్రీం లీడర్ మొజ్తాబా ఖమేనీ(Mojtaba Khamenei) ఆరోగ్యంపై ఇటీవల రోజుకొక వార్త వెలుగులోకి వస్తోంది. ఖమేనీ తీవ్ర అనారోగ్యంతో బాధ పడుతున్నారని, ఆయన పరిస్థితి విషమంగా ఉందని కథనాలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో తమ మత గురువు ఆరోగ్యం భేషుగ్గా ఉందని, ప్రచారంలో ఉన్న వార్తలన్నీ ఉత్తవేనని తాజాగా వీడియో విడుదల చేసింది ఇరాన్. అనధికారిక మెహర్ న్యూస్(Mehr News Agency) ఏజెన్సీ సోషల్ మీడియాలో ఓ వీడియో పెట్టింది. అందులో ఖమేనీ ఆరోగ్యంగా కనిపించారు. తన అనుచరులతో ఏదో విషయమై మాట్లాడుతూ సూచనలు ఇస్తున్నారు.
మొజ్తబా ఖమేనీ కొన ఊపిరితో ఉన్నారనే వార్తలకు ఇరాన్ మీడియా చెక్ పెట్టింది. అనధికారిక మెహర్ న్యూస్ ఏజెన్సీ తమ అధినేత పూర్తి ఆరోగ్యంతో ఉన్నారని ప్రపంచానికి చెప్పేదుకు ఆదివారం ఉదయం పాత వీడియో పంచుకుంది. ఖమీనీ పరిస్థితి విషమంగా ఉందని కథనాలు వైరలవుతున్న వేళ తొలిసారి మొహర్ న్యూస్ ఏజెన్సీ వీడియోతో బదులిచ్చింది. అయితే.. ఈ వీడియో ఇటీవల తీసిందా? లేదా పాత వీడియోనా? అనేది మాత్రం ఆ వార్త సంస్థ చెప్పలేదు.
Mojtaba is possibly dead or horribly injured.
Having buried Khamenie, through a proper ceremony for projecting power, unity, world attention it is time for Mojtaba, who has been the guiding power in absentia to either come out or go finally.
The fractures will come fast in the… https://t.co/Advw3KjWRa— Lt Gen DP Pandey (@LtGenDPPandey) August 9, 2026
ఖమేనీ ఆరోగ్యం విషమించింది, ఆయన గురించి ఇరాన్ అధ్యక్షుడు మసౌద్ పెజెష్కియాన్, సీనియర్ నాయకులు ఆందోళన చెందుతున్నారని ఇరాన్ వైర్ పేర్కొన్నట్టు ది జెరూసలేం పోస్ట్ ప్రచురించింది. అంతేకాదు మనం త్వరలోనే ఖమేనీ మరణ వార్త విన్నా ఆశ్చర్యమేమీ లేదని స్పష్టం చేసింది. ఈ వార్తలకు బలం చేకూర్చేలా.. ఇరాన్ అధ్యక్షుడు ఓ టీవీ ఇంటర్వ్యూలో.. ఖమేనీతో నేరుగా మాట్లాడడం చాలా కష్టంగా మారింది అని వెల్లడించారు. ఈ ఏడాది ఫిబ్రవరి 28న అమెరికా దళాల దాడుల్లో ఖమేనీ మరణం అనంతరం.. ఆయన వారసుడిగా 54 ఏళ్ల మొజ్తాబా ఖమేనీ సుప్రీం లీడర్ అయ్యారు. కానీ, ఆ తదుపరి దాడుల్లో మొజ్తాబా సైతం తీవ్రంగా గాయపడ్డారనే వార్తలు వచ్చాయి. అందుకే.. ఆయన తండ్రి అంత్యక్రియలకు సైతం హాజరుకాలేదు.