Dharmendra Pradhan : నీట్ పేపర్ లీకేజీపై జెన్‌జీ (Gen Z) ఉద్యమించడంతో కేంద్ర మంత్రి పదవికి రాజీనామా చేసిన ధర్మేంద్ర ప్రధాన్ (Dharmendra Pradhan) తనకు పదవులపై ఆశ లేదని చెప్పారు. కాక్రోచ్ జనతా పార్టీ (CJP) ఆధ్యర్వంలో జరిగిన నీట్ ఉద్యమం సమయంలో కొందరు జెన్‌జీని తప్పుదారి పట్టించారని ప్రధాన్ ఆరోపించారు. జెన్‌జీ కూడా మా పిల్లలే, కానీ, కొన్ని రాజకీయ శక్తులు వారిని తప్పుదోవ పట్టించాయి అని మాజీ మంత్రి పేర్కొన్నారు.
దేశవ్యాప్తంగా అలజడి రేపిన నీట్ ప్రశ్నాపత్రం లీకేజీ.. ఆపై జెన్‌జీ ఉద్యమంతో కేంద్ర విద్యాశాఖ మంత్రి పదవిని వదులుకున్న ధర్మేంద్ర ప్రధాన్ విపక్షాలపై ధ్వజమెత్తారు. తనకు మంత్రి పదవి ముఖ్యం కాదని, విద్యార్థుల భవిష్యత్తే తనకు ప్రధానమని ఆయన వెల్లడించారు. అంతేకాదు తానే స్వయంగా ప్రధాని నరేంద్ర మోడీని కలిసి రాజీనామా చేశానని మాజీ మంత్రి తెలిపారు.
Sambalpur, Odisha | BJP MP Dharmendra Pradhan says, “Gen Z belongs to us. Some people tried to deceive Gen Z. The ministerial position was not at all a prestige issue for me… My responsibility is nothing compared to the resolve of the new generation. I tried to explain the… pic.twitter.com/xeY1ff6xGR
— ANI (@ANI) August 9, 2026
‘జెన్‌జీ కూడా మా పిల్లలే. అయితే.. కొందరు వారిని తప్పుదోవ పట్టించాలని చూశారు. నాకు జెన్‌జీ పట్ల ఎలాంటి వ్యక్తిగత సమస్యలు లేవు. ప్రతి ఏడాది దాదాపు 2 కోట్ల మంది పుడుతుంటారు. గత పదేళ్లలో 20 కోట్ల మంది జన్మించి ఉంటారు. యువతరానికి ఎన్నో కలలు ఉంటాయి. వారు భారత్‌ను విశ్వ గురువుగా మారుస్తారు. నాకు కేంద్ర మంత్రి పదవి ఏమాత్రం ముఖ్యం కాదు. నేను ప్రధానిని కలిసి రాజీనామా ప్రతిపాదన చేశాను’ అని ధర్మేంద్ర ప్రధాన్ పేర్కొన్నారు. నీట్ పేపర్ లీకేజీపై జవాబుదారీతనం కోరుతూ సీజేపీ నేతృత్వంలో మొదలైన ఉద్యమం చివరకు ప్రధాన్ రాజీనామాకు దారి తీసింది. జూలై 25 వ తేదీన ఆయన పదవి నుంచి వైదొలిగారు. అనంతరం.. ప్రహ్లాద్ జోషి నూతన విద్యా శాఖ మంత్రిగా బాధ్యతలు చేపట్టారు.
— Dharmendra Pradhan (@dpradhanbjp) July 25, 2026