Preeti Munde : ఆదిలాబాద్ జిల్లాకు చెందిన యువతి అందాల పోటీల్లో విజేతగా నిలిచింది. మిస్ ఎర్త్ వాటర్ ఇండియా–2026 పోటీల్లో విజేతగా నిలిచి ఆమె కిరీటాన్ని కైవసం చేసుకుంది. ఆదిలాబాద్ జిల్లా ఇంద్రవెల్లి మండలం హీరాపూర్ గ్రామానికి చెందిన ప్రీతి ముండే అనే యువతికి ఈ ఘనత దక్కింది. తాజాగా జైపూర్ వేదికగా మిస్ ఎర్త్ వాటర్ ఇండియా-2026 అందాల పోటీలు నిర్వహించారు. ఈ జాతీయ స్థాయి అందాల పోటీల్లో తెలంగాణకు ప్రాతినిధ్యం వహించిన ప్రీతి ముండే కిరీటాన్ని కైవసం చేసుకున్నారు.
పోటీల్లో ఆమె చూపిన స్నేహపూర్వక స్వభావానికిగాను మిస్ కంజీనియాలిటీ–2026 టైటిల్ కూడా సొంతం చేసుకున్నారు. ఈ విజయం ద్వారా ఆమె జాతీయ స్థాయిలో తెలంగాణ ఖ్యాతిని చాటారు. గ్రామీణ ప్రాంతం, సాధారణ కుటుంబంలో జన్మించిన ప్రీతి కేంద్ర ప్రభుత్వ ఆయుష్మాన్ ఆరోగ్య మందిర్, ప్రగతి గ్రూప్ స్కూల్స్‌లో యోగా టీచర్‌గా సేవలందిస్తున్నారు. మాజీ ఎన్సీసీ కేడెట్ అయిన ప్రీతి ముండే.. జాతీయ స్థాయి యోగా క్రీడాకారిణి, జ్యోతిష్యురాలు, మోడల్, ఔత్సాహిక పారిశ్రామికవేత్తగా ఎదిగారు.