Swag of Arjun | నాగచైతన్య ‘వృషకర్మ’ నుంచి ‘స్వాగ్ ఆఫ్ అర్జున్’ ఫస్ట్ సింగిల్ అప్డేట్!
Vrishakarma First Single | యువ సామ్రాట్ నాగచైతన్య నటిస్తున్న అత్యంత ప్రతిష్టాత్మక మైథలాజికల్ థ్రిల్లర్ ‘వృషకర్మ’ ప్రపంచవ్యాప్తంగా డిసెంబర్ 4న గ్రాండ్‌గా థియేట్రికల్ రిలీజ్‌కు సిద్ధమవుతోంది.
Vrishakarma First Single | యువ సామ్రాట్ నాగచైతన్య నటిస్తున్న అత్యంత ప్రతిష్టాత్మక మైథలాజికల్ థ్రిల్లర్ ‘వృషకర్మ’ ప్రపంచవ్యాప్తంగా డిసెంబర్ 4న గ్రాండ్‌గా థియేట్రికల్ రిలీజ్‌కు సిద్ధమవుతోంది. కార్తీక్ దండు దర్శకత్వంలో రూపుదిద్దుకుంటున్న ఈ సినిమా ప్రేక్షకులకు సరికొత్త సినిమాటిక్ అనుభూతిని అందించనుంది. ప్రముఖ నిర్మాణ సంస్థలు శ్రీ వెంకటేశ్వర సినీ చిత్ర (ఎస్వీసీసీ), సుకుమార్ రైటింగ్స్ బ్యానర్లపై బీవీఎస్ఎన్ ప్రసాద్, సుకుమార్ బి సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తుండగా, బాపినీడు సమర్పిస్తున్నారు. భారీ బడ్జెట్‌తో తెరకెక్కుతున్న ఈ సినిమా నాగచైతన్య కెరీర్లోనే అత్యధిక ప్రీ-రిలీజ్ బిజినెస్‌ను సాధించి, ట్రేడ్ వర్గాల్లోనూ భారీ అంచనాలను రేకెత్తిస్తోంది.
తాజాగా ఈ సినిమా నుంచి మేకర్స్ మ్యూజికల్ జర్నీని ప్రారంభిస్తూ, ఫస్ట్ సింగిల్ ‘స్వాగ్ ఆఫ్ అర్జున్’ను నవంబర్ 7న విడుదల చేయనున్నట్లు అధికారికంగా ప్రకటించారు. ఈ సందర్భంగా విడుదల చేసిన అనౌన్స్మెంట్ పోస్టర్ సినిమాపై క్యూరియాసిటీని విపరీతంగా పెంచేస్తోంది. ఈ పోస్టర్లో నాగచైతన్య సైడ్ ప్రొఫైల్‌లో బ్లాక్ గాగుల్స్, ఇయర్‌ఫోన్స్‌తో చాలా ఇంటెన్స్ లుక్‌లో కనిపిస్తున్నారు. భుజంపై గాయం, డార్క్ బ్యాక్‌డ్రాప్ ఈ పోస్టర్‌కు మరింత రఫ్ అండ్ రగ్గడ్ అప్పీల్‌ను తెచ్చిపెట్టాయి. అర్జున్ పాత్రలోని స్వాగ్, అటిట్యూడ్‌ను పూర్తిగా ప్రతిబింబించేలా ఈ డిజైన్ ఉండటంతో ఫస్ట్ సింగిల్‌పై సర్వత్రా ఆసక్తి నెలకొంది.
ఈ చిత్రంలో నాగచైతన్య సరసన ప్రతిభావంతురాలైన నటి మీనాక్షి చౌదరి హీరోయిన్గా నటిస్తుండగా, ‘లాపతా లేడీస్’ ఫేమ్ స్పర్శ్ శ్రీవాస్తవ పవర్ఫుల్ ప్రతినాయకుడి పాత్రలో కనిపించనున్నారు. ఈ సినిమాకు రగుల్ డి హెరియన్ సినిమాటోగ్రఫీ అందిస్తుండగా, సెన్సేషనల్ మ్యూజిక్ డైరెక్టర్ అజనీష్ బి. లోక్‌నాథ్ సంగీతం సమకూరుస్తున్నారు. అలాగే శ్రీ నాగేంద్ర తంగాల ప్రొడక్షన్ డిజైనర్‌గా, నవీన్ నూలి ఎడిటర్‌గా వ్యవహరిస్తున్నారు. టాప్ టెక్నీషియన్ల కలయికలో తెరకెక్కుతున్న ఈ మైథలాజికల్ థ్రిల్లర్ బాక్సాఫీస్ వద్ద సంచలనాలు సృష్టించడం ఖాయమని చిత్ర యూనిట్ ధీమా వ్యక్తం చేస్తోంది.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Swag of Arjun | నాగచైతన్య ‘వృషకర్మ’ నుంచి ‘స్వాగ్ ఆఫ్ అర్జున్’ ఫస్ట్ సింగిల్ అప్డేట్!
Tyson Naidu | బెల్లంకొండ సాయి శ్రీనివాస్ ‘టైసన్ నాయుడు’ నుంచి ‘మదరాసి రబ్బరు బొమ్మ’ మాస్ ఫోక్ సాంగ్ అప్డేట్!
AP News | మురసు తుపాను ఎఫెక్ట్.. రేపు కూడా పలు జిల్లాల్లో భారీ వర్షాలు..!
Ear Wax | గులిమి అంటే ఏమిటి.. దీని వల్ల లాభమా, నష్టమా.. తరచూ తొలగించాలా..?
Health tips | గుండె పదిలంగా ఉండాలంటే వంటలో తరచూ ఈ మార్పులు చేయాల్సిందే..!
ట్రెండింగ్ వార్తలు
Viral dance | ఆఫీస్ దీపావళి వేడుకల్లో యువతి డ్యాన్స్.. ఇంటర్నెట్లో ఏకంగా రెండు కోట్ల వ్యూస్.. Video
Watch: శివసేన నేత ఇంట్లో డ్రగ్స్ ఉంచిన పోలీస్ అధికారి.. తర్వాత ఏం జరిగిందంటే?
Viral news | ఆ ఇంట్లో రోజూ నాగుపాముల కలకలం.. ఏడ వెతికినా పాము గుడ్లే..!
Viral News | అనారోగ్యంతో ఉన్న అమ్మకోసం కేంద్ర మాజీ మంత్రి వేణుగానం..!
Watch: 8 ఏళ్ల బాలుడి దారుణం.. క్లాస్‌లో యూకేజీ బాలికపై రాయితో దాడి, చిన్నారి పరిస్థితి విషమం

