Tata Sons | టాటా సన్స్‌లో తీవ్రస్థాయికి నాయకత్వ వివాదం.. బాంబే హైకోర్టుకు టాటా ట్రస్టులు..!
Tata Sons | భారతదేశ దిగ్గజ పారిశ్రామిక సంస్థ అయిన టాటా సన్స్ (TATA sons) లో నాయకత్వ వివాదం మరోసారి తీవ్రస్థాయికి చేరింది. టాటా సన్స్ ఛైర్మన్‌గా ఎన్ చంద్రశేఖరన్ (N Chandrashakaran) ను మళ్లీ నియమించడాన్ని సవాల్ చేస్తూ టాటా ట్రస్టులు (TATA trusts) బాంబే హైకోర్టు (Bombay High Court) ను ఆశ్రయించాయి. బోర్డు తీసుకున్న ఈ నిర్ణయాన్ని రద్దు చేయాలని, రూ.65 కోట్ల నష్టపరిహారం ఇప్పించాలని కోరుతూ చట్టపరమైన చర్యలకు పూనుకున్నాయి.
Tata Sons : భారతదేశ దిగ్గజ పారిశ్రామిక సంస్థ అయిన టాటా సన్స్ (TATA sons) లో నాయకత్వ వివాదం మరోసారి తీవ్రస్థాయికి చేరింది. టాటా సన్స్ ఛైర్మన్‌గా ఎన్ చంద్రశేఖరన్ (N Chandrashakaran) ను మళ్లీ నియమించడాన్ని సవాల్ చేస్తూ టాటా ట్రస్టులు (TATA trusts) బాంబే హైకోర్టు (Bombay High Court) ను ఆశ్రయించాయి. బోర్డు తీసుకున్న ఈ నిర్ణయాన్ని రద్దు చేయాలని, రూ.65 కోట్ల నష్టపరిహారం ఇప్పించాలని కోరుతూ చట్టపరమైన చర్యలకు పూనుకున్నాయి.
సర్ దొరాబ్జీ టాటా ట్రస్ట్ (SDTT), రతన్ దొరాబ్జీ టాటా ట్రస్ట్ (RDTT) ఈ నెల 25న ఈ మేరకు తీర్మానాలు చేశాయి. 2027 ఫిబ్రవరి 21 నుంచి మరో ఐదేళ్ల కాలానికి చంద్రశేఖరన్‌ను తిరిగి నియమిస్తూ సెప్టెంబర్ 17న టాటా సన్స్ బోర్డు తీసుకున్న నిర్ణయం చెల్లదని ట్రస్టులు వాదిస్తున్నాయి. టాటా సన్స్ ఆర్టికల్స్ ఆఫ్ అసోసియేషన్‌లోని ఆర్టికల్ 121 ప్రకారం.. కీలకమైన బోర్డు నిర్ణయాలకు టాటా ట్రస్టులు నామినేట్ చేసిన డైరెక్టర్లలో మెజారిటీ సభ్యుల ఆమోదం తప్పనిసరి. అయితే చంద్రశేఖరన్ పునర్నియామకం విషయంలో ఈ నిబంధనను ఉల్లంఘించారని ట్రస్టులు ఆరోపిస్తున్నాయి.
సెప్టెంబర్ 17న జరిగిన సమావేశంలో ట్రస్ట్ నామినీ అయిన నోయెల్ టాటా ఈ తీర్మానాన్ని వ్యతిరేకించగా.. మరో నామినీ వేణు శ్రీనివాసన్ మద్దతు తెలిపారు. దాంతో సమావేశానికి అధ్యక్షత వహించిన స్వతంత్ర డైరెక్టర్ హరీశ్ మన్వానీ తన నిర్ణయాత్మక ఓటువేసి తీర్మానాన్ని ఆమోదింపజేశారు. అయితే ఈ కాస్టింగ్ ఓటు ఆర్టికల్ 121ను అధిగమించజాలదని, కాబట్టి ఆ తీర్మానం చెల్లదని ట్రస్టులు పేర్కొంటున్నాయి. ఎస్‌డీటీటీ ద్వారా రూ.50 కోట్లు, ఆర్డీటీటీ ద్వారా రూ.15 కోట్లతోపాటు 18 శాతం వడ్డీని నష్టపరిహారంగా కోరుతున్నాయి.
ఈ తాజా పరిణామంతో దేశంలోని అతిపెద్ద వ్యాపార సామ్రాజ్యంలో నాయకత్వ పోరు మరింత ముదిరింది.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Tata Sons | టాటా సన్స్‌లో తీవ్రస్థాయికి నాయకత్వ వివాదం.. బాంబే హైకోర్టుకు టాటా ట్రస్టులు..!
Congress MLA | హామీలపై నిలదీసినందుకు మైనార్టీలపై చిందులేసిన కాంగ్రెస్ ఎమ్మెల్యే అనిరుధ్ రెడ్డి
IND-US Trade | ట్రంప్ 25 శాతం టారిఫ్స్ వార్నింగ్.. భారత ‘మేకిన్ ఇండియా’కు సవాళ్లు..!
Akhil | జపాన్‌లో అఖిల్ ‘లెనిన్’ సందడి.. డిసెంబర్ 11న గ్రాండ్ రిలీజ్!
Harish Rao | సైన్స్ ఫెయిర్ జరిపే స్థోమత కూడా ప్రభుత్వానికి లేదా..? : హరీశ్ రావు
ట్రెండింగ్ వార్తలు
Anjali Kulthe | ఆ ఉగ్రదాడి నుంచి 20 మంది గర్భిణీలను కాపాడిన నర్సు..!
Watch: బస్‌స్టాప్ వద్ద వేచి ఉన్న విద్యార్థులు.. వారిపైకి దూసుకెళ్లిన వాహనం
Rahul Gandhi | నా తండ్రిని చంపడానికే ఆయన భద్రతను తొలగించారు.. అప్పటి కేంద్ర సర్కారుపై రాహుల్‌గాంధీ ఆరోపణ..!
Watch: ఇద్దరు వరులను ఆశ్చర్యపరిచిన బావ.. కోటి విలువైన కరెన్సీ దండలు బహూకరణ
Watch: అసదుద్దీన్ ఒవైసీని సుప్రీంకోర్టు జడ్జిగా పొరబడిన పోలీసులు.. గౌరవ వందనం సమర్పణ

