Tyson Naidu | బెల్లంకొండ సాయి శ్రీనివాస్ ‘టైసన్ నాయుడు’ నుంచి ‘మదరాసి రబ్బరు బొమ్మ’ మాస్ ఫోక్ సాంగ్ అప్డేట్!
Bellamkonda Sai Sreenivas | టాలీవుడ్ యువ నటుడు బెల్లంకొండ సాయి శ్రీనివాస్ కథానాయకుడిగా టాలెంటెడ్ డైరెక్టర్ సాగర్ కె చంద్ర దర్శకత్వంలో రూపుదిద్దుకుంటున్న యూనిక్ యాక్షన్ ఎంటర్టైనర్ ‘టైసన్ నాయుడు’.
Bellamkonda Sai Sreenivas | టాలీవుడ్ యువ నటుడు బెల్లంకొండ సాయి శ్రీనివాస్ కథానాయకుడిగా టాలెంటెడ్ డైరెక్టర్ సాగర్ కె చంద్ర దర్శకత్వంలో రూపుదిద్దుకుంటున్న యూనిక్ యాక్షన్ ఎంటర్టైనర్ ‘టైసన్ నాయుడు’. ప్రతిష్టాత్మక నిర్మాణ సంస్థ 14 రీల్స్ ప్లస్ బ్యానర్‌పై రామ్ ఆచంట, గోపీ ఆచంట ఈ చిత్రాన్ని అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదలైన పోస్టర్లు, టైటిల్ గ్లింప్స్‌కు ప్రేక్షకుల నుంచి ట్రెమండస్ రెస్పాన్స్ వచ్చింది. ఈ నేపథ్యంలో తాజాగా మేకర్స్ మ్యూజిక్ ప్రమోషన్స్‌ను ప్రారంభిస్తూ, చిత్రంలోని ఫస్ట్ సింగిల్ అప్డేట్ను అధికారికంగా ప్రకటించారు.
ఈ సినిమాలోని ‘మదరాసి రబ్బరు బొమ్మ’ అనే మాస్ ఫోక్ సాంగ్‌ను నవంబర్ 6న విడుదల చేయనున్నట్లు చిత్ర యూనిట్ వెల్లడించింది. ఈ మేరకు విడుదల చేసిన అనౌన్స్మెంట్ పోస్టర్లో హీరో హీరోయిన్లు సంప్రదాయ ఫోక్ లుక్‌లో కనిపిస్తూ కలర్‌ఫుల్ బ్యాక్‌డ్రాప్‌లో సందడి చేస్తుండటం పాటపై అంచనాలను విపరీతంగా పెంచేస్తోంది. ఈ చిత్రంలో బెల్లంకొండ సాయి శ్రీనివాస్‌ను మునుపెన్నడూ చూడని సరికొత్త యాక్షన్ ప్యాక్డ్ క్యారెక్టర్లో డైరెక్టర్ సాగర్ కె చంద్ర ప్రెజెంట్ చేస్తున్నారు. ఈ సినిమాకు సెన్సేషనల్ కంపోజర్ భీమ్స్ సిసిరోలియో సంగీతం అందిస్తుండగా, ముఖేష్ జ్ఞానేష్, అనిత్ డీవోపీగా, కోటగిరి వెంకటేశ్వరరావు ఎడిటర్‌గా, అవినాష్ కొల్లా ఆర్ట్ డైరెక్టర్‌గా వ్యవహరిస్తున్నారు. అలాగే స్టన్ శివ, విజయ్, వెంకట్, రియల్ సతీష్ భారీ యాక్షన్ సీక్వెన్స్‌లకు కొరియోగ్రఫీ అందిస్తున్నారు. టాప్ టెక్నీషియన్లతో తెరకెక్కుతున్న ఈ చిత్రం మాస్ ఆడియెన్స్‌ను ఎంతగానో అలరించనుందని మేకర్స్ నమ్మకం వ్యక్తం చేస్తున్నారు.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Tyson Naidu | బెల్లంకొండ సాయి శ్రీనివాస్ ‘టైసన్ నాయుడు’ నుంచి ‘మదరాసి రబ్బరు బొమ్మ’ మాస్ ఫోక్ సాంగ్ అప్డేట్!
AP News | మురసు తుపాను ఎఫెక్ట్.. రేపు కూడా పలు జిల్లాల్లో భారీ వర్షాలు..!
Ear Wax | గులిమి అంటే ఏమిటి.. దీని వల్ల లాభమా, నష్టమా.. తరచూ తొలగించాలా..?
Health tips | గుండె పదిలంగా ఉండాలంటే వంటలో తరచూ ఈ మార్పులు చేయాల్సిందే..!
AP News | జడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికలకు రేపే పోలింగ్.. సర్వం సిద్ధం చేశామన్న ఎన్నికల కమిషనర్..!
ట్రెండింగ్ వార్తలు
Viral dance | ఆఫీస్ దీపావళి వేడుకల్లో యువతి డ్యాన్స్.. ఇంటర్నెట్లో ఏకంగా రెండు కోట్ల వ్యూస్.. Video
Watch: శివసేన నేత ఇంట్లో డ్రగ్స్ ఉంచిన పోలీస్ అధికారి.. తర్వాత ఏం జరిగిందంటే?
Viral news | ఆ ఇంట్లో రోజూ నాగుపాముల కలకలం.. ఏడ వెతికినా పాము గుడ్లే..!
Viral News | అనారోగ్యంతో ఉన్న అమ్మకోసం కేంద్ర మాజీ మంత్రి వేణుగానం..!
Watch: 8 ఏళ్ల బాలుడి దారుణం.. క్లాస్‌లో యూకేజీ బాలికపై రాయితో దాడి, చిన్నారి పరిస్థితి విషమం

