car plunges into gorge | లోయలో పడిన కారు.. ఆరుగురు మహిళలతో సహా ఏడుగురు మృతి, మరో ఐదుగురికి గాయాలు
car plunges into gorge | అదుపుతప్పిన కారు లోయలోకి దూసుకెళ్లింది. అందులో ప్రయాణించిన 12 మందిలో ఆరుగురు మహిళలతో సహా ఏడుగురు మరణించారు. మరో ఐదుగురు మహిళలు తీవ్రంగా గాయపడ్డారు. వారిని ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.
డెహ్రాడూన్: అదుపుతప్పిన కారు లోయలోకి దూసుకెళ్లింది. అందులో ప్రయాణించిన 12 మందిలో ఆరుగురు మహిళలతో సహా ఏడుగురు మరణించారు. మరో ఐదుగురు మహిళలు తీవ్రంగా గాయపడ్డారు. వారిని ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. (car plunges into gorge) ఉత్తరాఖండ్‌లోని పౌరీ గర్వాల్ జిల్లాలో ఈ సంఘటన జరిగింది. బ్లాక్ స్థాయి స్వయం సహాయక బృందానికి చెందిన 11 మంది మహిళలు, రిఖ్నిఖాల్ నుంచి కారులో బయలుదేరారు. శనివారం మధ్యాహ్నం 1 గంట సమయంలో కలవాడి సమీపంలో డ్రైవర్ నియంత్రణ కోల్పోయాడు. అదుపు తప్పిన ఆ కారు లోయలోకి దూసుకెళ్లింది.
కాగా, కారు డ్రైవర్‌తో పాటు ఆరుగురు మహిళలు సంఘటనా స్థలంలో మరణించారు. మరో ఐదుగురు మహిళలు తీవ్రంగా గాయపడ్దారు. పోలీసులు, ఎస్డీఆర్ఎఫ్ సిబ్బంది అక్కడకు చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. గాయపడిన ఐదుగురు మహిళలను చికిత్స కోసం ఆసుపత్రికి తరలించారు.
మరోవైపు ప్రధాని మోదీ ఈ ప్రమాదం పట్ల తీవ్ర విచారం వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు రూ. 2 లక్షల చొప్పున, గాయపడిన వారికి రూ.50,000 చొప్పున ఎక్స్‌గ్రేషియా ప్రకటించారు. ఉత్తరాఖండ్ ముఖ్యమంత్రి పుష్కర్ సింగ్ ధామి కూడా మృతుల పట్ల విచారం వ్యక్తం చేశారు. తీవ్రంగా గాయపడిన వారికి ఉన్నత స్థాయి వైద్య సదుపాయం కోసం విమానంలో తరలించే ఏర్పాట్లు చేయాలని అధికారులను ఆదేశించారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
car plunges into gorge | లోయలో పడిన కారు.. ఆరుగురు మహిళలతో సహా ఏడుగురు మృతి, మరో ఐదుగురికి గాయాలు
‘విద్యార్థులకు నిర్దేశిత మెనూ తప్పనిసరిగా అమలు చేయాలి’
‘సాగునీటి తరలింపును అడ్డుకోవడంలో కాంగ్రెస్ ప్రభుత్వం విఫలం’
Notices | ధాన్యం బకాయిలు చెల్లించాలని రైస్ మిల్ యజమానికి నోటీసులు
mother kills son | మరో కులం మహిళను పెళ్లి చేసుకుంటానన్న కొడుకు.. హత్య చేసిన తల్లి
ట్రెండింగ్ వార్తలు
Watch: పైనాపిల్స్ లోడ్‌తో వెళ్తున్న వాహనం బోల్తా.. తర్వాత ఏం జరిగిందంటే?
1 Woman 3 Nominations | స్థానిక సంస్థల ఎన్నికల్లో షాక్ ఇచ్చిన మహిళ.. మూడు దుస్తుల్లో మూడుసార్లు నామినేషన్
Offbeat | బీచ్‌లో గర్ల్‌ఫ్రెండ్‌కు డైమండ్ రింగ్‌తో ప్రపోజ్.. అంతలోనే రింగ్ మాయం.. ఏం జరిగిందంటే..!
Offbeat | పార్కులో ఒంటరిగా కూర్చున్న మహిళకు రూ.2,500 జరిమానా.. కారణం తెలిస్తే షాకవ్వాల్సిందే..!
Holiday list | 2027 కేంద్ర ప్రభుత్వ సెలవుల జాబితా విడుదల.. ఈ రోజుల్లో కేంద్ర కార్యాలయాలు క్లోజ్..!

