‘విద్యార్థులకు నిర్దేశిత మెనూ తప్పనిసరిగా అమలు చేయాలి’
గురుకుల పాఠశాలలు, ప్రభుత్వ పాఠశాలలు, అంగన్వాడీ కేంద్రాల్లో విద్యార్థులకు నిర్దేశించిన మెనూ తప్పనిసరిగా అమలు చేయాలని రాష్ట్ర చైల్డ్ వెల్ఫేర్ కమిషన్ సభ్యురాలు సరిత ఆదేశించారు. నిబంధనలు పాటించకపోతే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. శనివారం...
– రాష్ట్ర చైల్డ్ వెల్ఫేర్ కమిషన్ సభ్యురాలు సరిత
తుంగతుర్తి, నవంబర్ 28 : గురుకుల పాఠశాలలు, ప్రభుత్వ పాఠశాలలు, అంగన్వాడీ కేంద్రాల్లో విద్యార్థులకు నిర్దేశించిన మెనూ తప్పనిసరిగా అమలు చేయాలని రాష్ట్ర చైల్డ్ వెల్ఫేర్ కమిషన్ సభ్యురాలు సరిత ఆదేశించారు. నిబంధనలు పాటించకపోతే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. శనివారం తుంగతుర్తి మండల కేంద్రంలోని అంగన్వాడీ కేంద్రాలు, ప్రాథమిక పాఠశాల, బాలుర గురుకుల పాఠశాలను ఆకస్మికంగా తనిఖీ చేసి మధ్యాహ్న భోజనాన్ని పరిశీలించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. అంగన్వాడీ చిన్నారుల నుండి గురుకుల విద్యార్థుల వరకు ప్రతి ఒక్కరికీ నాణ్యమైన భోజనం అందించాలని సూచించారు.

Saritha01
అంగన్వాడీ టీచర్లు, ప్రధానోపాధ్యాయులు, ప్రిన్సిపాళ్లు వారానికి సంబంధించిన మెనూను తప్పనిసరిగా అమలు చేయాలని స్పష్టం చేశారు. గురుకుల పాఠశాలలో తొమ్మిదో తరగతి చదువుతున్న విద్యార్థి ప్రమాదవశాత్తు విద్యుత్ తీగ తగిలి గాయపడిన ఘటన తన దృష్టికి వచ్చిందన్నారు. బాధిత విద్యార్థితో పాటు అతడి తల్లిదండ్రులకు ఫోన్ చేసి ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నట్లు తెలిపారు. విద్యార్థుల భద్రత విషయంలో సిబ్బంది నిర్లక్ష్యం వహించకూడదని హెచ్చరించారు. వారి బంగారు భవిష్యత్‌ను కాపాడాల్సిన బాధ్యత అందరిపైనా ఉందన్నారు. ఈ కార్యక్రమంలో ప్రిన్సిపాల్ సతీశ్, పాఠశాల సిబ్బంది పాల్గొన్నారు.
Read Today's Latest Nalgonda News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
‘విద్యార్థులకు నిర్దేశిత మెనూ తప్పనిసరిగా అమలు చేయాలి’
‘సాగునీటి తరలింపును అడ్డుకోవడంలో కాంగ్రెస్ ప్రభుత్వం విఫలం’
Notices | ధాన్యం బకాయిలు చెల్లించాలని రైస్ మిల్ యజమానికి నోటీసులు
mother kills son | మరో కులం మహిళను పెళ్లి చేసుకుంటానన్న కొడుకు.. హత్య చేసిన తల్లి
High Blood Pressure | చలికాలంలో బీపీ పెరుగుతుందా..? మందుల డోసు పెంచి వేసుకోవాలా..?
ట్రెండింగ్ వార్తలు
Watch: పైనాపిల్స్ లోడ్‌తో వెళ్తున్న వాహనం బోల్తా.. తర్వాత ఏం జరిగిందంటే?
1 Woman 3 Nominations | స్థానిక సంస్థల ఎన్నికల్లో షాక్ ఇచ్చిన మహిళ.. మూడు దుస్తుల్లో మూడుసార్లు నామినేషన్
Offbeat | బీచ్‌లో గర్ల్‌ఫ్రెండ్‌కు డైమండ్ రింగ్‌తో ప్రపోజ్.. అంతలోనే రింగ్ మాయం.. ఏం జరిగిందంటే..!
Offbeat | పార్కులో ఒంటరిగా కూర్చున్న మహిళకు రూ.2,500 జరిమానా.. కారణం తెలిస్తే షాకవ్వాల్సిందే..!
Holiday list | 2027 కేంద్ర ప్రభుత్వ సెలవుల జాబితా విడుదల.. ఈ రోజుల్లో కేంద్ర కార్యాలయాలు క్లోజ్..!

