High Blood Pressure | చలికాలంలో బీపీ పెరుగుతుందా..? మందుల డోసు పెంచి వేసుకోవాలా..?
చలికాలంలో ఉష్ణోగ్రతలు తగ్గినప్పుడు రక్తపోటు పెరిగే అవకాశం ఉంటుంది. శరీరంలోని వేడిని కాపాడుకునేందుకు రక్తనాళాలు కుచించుకుపోవడం వల్ల గుండె రక్తాన్ని పంపించడానికి మరింత శ్రమించాల్సి వస్తుంది. ఇప్పటికే అధిక రక్తపోటుతో బాధపడేవారికి ఈ కాలంలో దాన్ని నియంత్రించడం కొంత కష్టంగా మారుతుంది.
High Blood Pressure | చలికాలంలో ఉష్ణోగ్రతలు తగ్గినప్పుడు రక్తపోటు పెరిగే అవకాశం ఉంటుంది. శరీరంలోని వేడిని కాపాడుకునేందుకు రక్తనాళాలు కుచించుకుపోవడం వల్ల గుండె రక్తాన్ని పంపించడానికి మరింత శ్రమించాల్సి వస్తుంది. ఇప్పటికే అధిక రక్తపోటుతో బాధపడేవారికి ఈ కాలంలో దాన్ని నియంత్రించడం కొంత కష్టంగా మారుతుంది. ముఖ్యంగా వృద్ధులు, గుండె జబ్బులు లేదా మూత్రపిండాల సమస్యలు ఉన్నవారిపై చలి ప్రభావం ఎక్కువగా ఉంటుంది. చలికాలంలో శారీరక శ్రమ తగ్గడం వల్ల బరువు పెరిగే ప్రమాదం ఉంటుంది. అలగే చలి కారణంగా దాహం తక్కువగా అనిపించడంతో చాలామంది తగినంత నీరు తాగరు. దీనివల్ల రక్తం చిక్కబడడం, రక్తపోటులో హెచ్చుతగ్గులు రావడం వంటి సమస్యలు ఎదురవుతాయి. ఆహారపు అలవాట్లలో మార్పులు కూడా రక్తపోటు నియంత్రణపై ప్రభావం చూపుతాయి.
మందుల డోసు పెంచాలా..?
అయితే వాతావరణం చల్లబడిందని రక్తపోటు మందుల మోతాదును లేదా సమయాన్ని స్వయంగా మార్చుకోవద్దని వైద్యులు సూచిస్తున్నారు. చలికాలంలో ఇంటి వద్ద రక్తపోటును క్రమం తప్పకుండా పరీక్షించుకోవడం మంచిది. మందులు సరిగ్గా వాడుతున్నప్పటికీ రక్తపోటు సాధారణ స్థాయి కంటే వరుసగా ఎక్కువగా నమోదైతే వైద్యులను సంప్రదించాలి. పరీక్షల ఫలితాలు, వ్యక్తి ఆరోగ్య పరిస్థితిని పరిశీలించిన తర్వాత మాత్రమే మందుల మోతాదులో మార్పులు చేయాలా వద్దా అని వైద్యులు నిర్ణయిస్తారు. మందులను అకస్మాత్తుగా ఆపడం లేదా మోతాదును తగ్గించడం వల్ల రక్తపోటు అదుపు తప్పి గుండె జబ్బులు, పక్షవాతం వంటి సమస్యల ప్రమాదం పెరుగుతుంది.
తరచూ పరీక్షించుకోవడం అవసరం..
చలికాలంలో ప్రతిరోజూ ఒకే సమయానికి, కొంతసేపు విశ్రాంతి తీసుకున్న తర్వాత రక్తపోటును పరీక్షించుకోవాలి. నమోదైన వివరాలను రికార్డు చేసుకుని వైద్యులకు చూపించాలి. అవసరాన్ని బట్టి మూత్రపిండాల పనితీరు, రక్తంలోని లవణాల స్థాయిలు, కొలెస్ట్రాల్ వంటి అంశాలను పరీక్షించవచ్చు. రక్తపోటు వరుసగా పెరుగుతున్నా లేదా అసాధారణంగా తలతిరుగుతున్నా వైద్యులను సంప్రదించాలి. పరిస్థితిని బట్టి వారు కొంతకాలం మందుల మోతాదును పెంచుతారు లేదా మరో మందును సూచిస్తారు. అయితే చలి, జలుబు తగ్గించే కొన్ని సాధారణ మందుల్లో రక్తనాళాలను కుచించుకు పోయేలా చేసే పదార్థాలు ఉంటాయి. ఇవి రక్తపోటును ఒక్కసారిగా పెంచుతాయి. అందువల్ల అలాంటి మందులు వాడే ముందు వైద్యులు లేదా ఔషధ నిపుణుల సలహా తీసుకోవాలి. అధిక రక్తపోటుతోపాటు ఛాతిలో నొప్పి లేదా బిగుతు, శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది, తీవ్రమైన తలనొప్పి, చూపులో మార్పులు లేదా తలతిరగడం ఉంటే వెంటనే వైద్య సహాయం పొందాలి.
జాగ్రత్తలు తప్పనిసరి..
కొంతమందిలో దీనికి విరుద్ధంగా రక్తపోటు బాగా తగ్గి తలతిరగడం కూడా జరుగుతంది. అనారోగ్యం, ఆహారం లేదా నీరు తక్కువగా తీసుకోవడం, రోజువారీ అలవాట్లలో మార్పులు ఇందుకు కారణం అవుతాయి. ఇలాంటి సమయంలోనూ వైద్యుల సలహా లేకుండా మందులు ఆపకూడదు. చలికాలమంతా సూచించిన మందులను క్రమం తప్పకుండా తీసుకోవడం, తగినంత నీరు తాగడం, శారీరకంగా చురుకుగా ఉండడం, ఉప్పు ఎక్కువగా తీసుకోకుండా జాగ్రత్తపడడం అవసరం. వాతావరణం ఆధారంగా కాకుండా, రక్తపోటు పరీక్షల్లో నమోదయ్యే విలువలు, మొత్తం ఆరోగ్య పరిస్థితిని బట్టి మాత్రమే చికిత్సలో మార్పులు చేయాలి. రోజువారి పర్యవేక్షణతో చలికాలంలోనూ రక్తపోటును అదుపులో ఉంచుకోవచ్చని నిపుణులు తెలియజేస్తున్నారు.
Read Today's Latest Health News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
High Blood Pressure | చలికాలంలో బీపీ పెరుగుతుందా..? మందుల డోసు పెంచి వేసుకోవాలా..?
Farmer | ‘రేవంత్ రెడ్డి చెప్పేవన్నీ బ్రోకర్ ముచ్చట్లే.. తెల్లారి లేస్తే మాకు కేసీఆరే గుర్తొస్తరు’
Annamayya Song | ఇంటర్నేషనల్ స్టేజ్‌పై మార్మోగిన అన్నమయ్య కీర్తన.. ‘బ్రహ్మమొక్కటే’ పాటకు గూస్బంప్స్..!
Businessman Arrest | ఆదిలాబాద్‌లో బినామీ పేర్లతో ఖాతాలు, పోర్జరీలకు పాల్పడ్డ ప్రముఖ వ్యాపారవేత్త అరెస్ట్
పోచంపల్లి కో-ఆపరేటివ్ అర్బన్ బ్యాంక్ సీఈవోకు బెస్ట్ సీఈవో అవార్డు
ట్రెండింగ్ వార్తలు
Watch: పైనాపిల్స్ లోడ్‌తో వెళ్తున్న వాహనం బోల్తా.. తర్వాత ఏం జరిగిందంటే?
1 Woman 3 Nominations | స్థానిక సంస్థల ఎన్నికల్లో షాక్ ఇచ్చిన మహిళ.. మూడు దుస్తుల్లో మూడుసార్లు నామినేషన్
Offbeat | బీచ్‌లో గర్ల్‌ఫ్రెండ్‌కు డైమండ్ రింగ్‌తో ప్రపోజ్.. అంతలోనే రింగ్ మాయం.. ఏం జరిగిందంటే..!
Offbeat | పార్కులో ఒంటరిగా కూర్చున్న మహిళకు రూ.2,500 జరిమానా.. కారణం తెలిస్తే షాకవ్వాల్సిందే..!
Holiday list | 2027 కేంద్ర ప్రభుత్వ సెలవుల జాబితా విడుదల.. ఈ రోజుల్లో కేంద్ర కార్యాలయాలు క్లోజ్..!

