Businessman Arrest | ఆదిలాబాద్‌లో బినామీ పేర్లతో ఖాతాలు, పోర్జరీలకు పాల్పడ్డ ప్రముఖ వ్యాపారవేత్త అరెస్ట్
Businessman Arrest | బినామీ పేర్లతో బ్యాంకు ఖాతాలు తెరిచి, ఫోర్జరీ, చీటింగ్‌కు పాల్పడిన ప్రముఖ వ్యాపారవేత్తను పోలీసులు అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు.
ఆదిలాబాద్ : బినామీ పేర్లతో బ్యాంకు ఖాతాలు ( Benami Accounts ) తెరిచి, ఫోర్జరీ, చీటింగ్‌కు పాల్పడిన ప్రముఖ వ్యాపారవేత్త ( Prominent businessman) ను పోలీసులు అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు.ఆదిలాబాద్ డీఎస్పీ జీవన్ రెడ్డి ( DSP Jeevan Reddy ) తెలిపిన వివరాల ప్రకారం..
జిల్లాలోని భుక్తాపూర్ గ్రామానికి చెందిన రాజ్ కుమర్ మిట్టల్ ( Rajkumar Mittal ) , తన సోదరుడు సంజీవ్ కుమార్ మిట్టల్‌తో కలిసి కర్మాగారంలో పనిచేసే కార్మికుల ఆధార్, పాన్ కార్డులు తీసుకుని వారి పేర్లపై బ్యాంకు ఖాతాలు తెరిచారు. ఆ ఖాతాల్లో కోట్లాది రూపాయల లావాదేవీలు జరిపి ఆదాయపు పన్ను ఎగవేతకు పాల్పడ్డారు.
బినామీ ఖాతాలను వినియోగించి ప్రభుత్వాన్ని, కార్మికులను మోసం చేశారని ఆరోపిస్తూ కార్మికులు స్థానిక వన్‌టౌన్ పోలీసు స్టేషన్లో ఫిర్యాదు చేయడంతో వారిపై కేసు నమోదు అయ్యిందని డీఎస్పీ తెలిపారు. పెర్క భూమన్న పేరుతో నిర్వహించిన బ్యాంకు ఖాతాలో 2013-14 ఆర్థిక సంవత్సరంలో రూ.5,16,41,322, 2014-15లో రూ.1,94,27,504 లావాదేవీలు జరిగినట్లు ఇన్‌కం ట్యాక్స్ అధికారులు గుర్తించారు. పలువురు కార్మికుల ఖాతాల ద్వారా 2012-13 నుంచి 2015-16 వరకు మొత్తం సుమారు రూ.8.55 కోట్ల మేర లావాదేవీలు జరిగినట్లు తెలిపారు.
తన సొంత బ్యాంకు ఖాతా కూడా ఫ్రీజ్ కావడంతో, తన అకౌంట్లో ఉన్న రెండు కోట్ల నగదును వాడుకోకుండా పోవడంతో బాధితుడు పెర్క భూమన్న నిందితులను నిలదీశాడని వివరించారు. ఈ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టిన పోలీసులు, నిందితుడు రాజ్ కుమార్ మిట్టల్‌ను అదుపులోకి తీసుకొని, శుక్రవారం అరెస్టు చేసి రిమాండ్ కు తరలించినట్లు పేర్కొన్నారు .
Read Today's Latest Adilabad News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Businessman Arrest | ఆదిలాబాద్‌లో బినామీ పేర్లతో ఖాతాలు, పోర్జరీలకు పాల్పడ్డ ప్రముఖ వ్యాపారవేత్త అరెస్ట్
పోచంపల్లి కో-ఆపరేటివ్ అర్బన్ బ్యాంక్ సీఈవోకు బెస్ట్ సీఈవో అవార్డు
B Vinod Kumar | కాంగ్రెస్ పార్టీ చేసిన ద్రోహమే కేసీఆర్ ఆమరణదీక్షకు ప్రధాన కారణం : బోయినపల్లి వినోద్ కుమార్
మరణించినట్లు రికార్డుల్లో నమోదు.. నిలిచిన పింఛన్
Governor Shiv Pratap Shukla | వికసిత భారత్ నిర్మాణంలో విశ్వవిద్యాలయాలు కీలక పాత్ర పోషించాలి : గవర్నర్ శివ ప్రతాప్ శుక్లా
ట్రెండింగ్ వార్తలు
Watch: పైనాపిల్స్ లోడ్‌తో వెళ్తున్న వాహనం బోల్తా.. తర్వాత ఏం జరిగిందంటే?
1 Woman 3 Nominations | స్థానిక సంస్థల ఎన్నికల్లో షాక్ ఇచ్చిన మహిళ.. మూడు దుస్తుల్లో మూడుసార్లు నామినేషన్
Offbeat | బీచ్‌లో గర్ల్‌ఫ్రెండ్‌కు డైమండ్ రింగ్‌తో ప్రపోజ్.. అంతలోనే రింగ్ మాయం.. ఏం జరిగిందంటే..!
Offbeat | పార్కులో ఒంటరిగా కూర్చున్న మహిళకు రూ.2,500 జరిమానా.. కారణం తెలిస్తే షాకవ్వాల్సిందే..!
Holiday list | 2027 కేంద్ర ప్రభుత్వ సెలవుల జాబితా విడుదల.. ఈ రోజుల్లో కేంద్ర కార్యాలయాలు క్లోజ్..!

