Farmer | ‘రేవంత్ రెడ్డి చెప్పేవన్నీ బ్రోకర్ ముచ్చట్లే.. తెల్లారి లేస్తే మాకు కేసీఆరే గుర్తొస్తరు’
Farmer | రేవంత్ రెడ్డి సీఎం అయిన తర్వాత అప్పులు తెచ్చి వ్యవసాయం చేస్తే మాకు ఏం లేదు.. ఇప్పుడు కాదు.. ఓడిపోయిన తెల్లారి నుంచే.. తెల్లారి లేస్తే మాకు కేసీఆరే గుర్తొస్తరు అని హనుమకొండలో ఓ యువ రైతు చెప్పుకొచ్చాడు.
Farmer | కాంగ్రెస్ సర్కార్ పాలనలో రైతుల పరిస్థితి ఎలా ఉందో తెలియజేసే దృశ్యాలు నిత్యం రాష్ట్రవ్యాప్తంగా కనిపిస్తున్నాయని ప్రత్యేకించి చెప్పనవసరం లేదు.. రేవంత్ రెడ్డి సీఎం అయిన తర్వాత మా రైతుల పరిస్థితి దారుణంగా ఉందని.. చెప్పుకునేటట్టు లేదని హనుమకొండలో ఓ యువ రైతు ఆవేదన వ్యక్తం చేశాడు.
సదరు రైతు మీడియాతో మాట్లాడుతూ.. రైతు బంధు పోయింది.. కేసీఆర్ ఉన్నప్పుడు 24 గంటలు కరెంట్ ఉండేది.. ఇప్పుడేమీ లేదు.. సీఎం రేవంత్ రెడ్డి చెప్పేవన్నీ బ్రోకర్ ముచ్చట్లే.. ఒక సీఎం హోదాలో ఉండి ఇట్లా బ్రోకర్ ముచ్చట్లు చెప్పకండి అని ఫైర్ అయ్యారు. అప్పులు తెచ్చిపెట్టి వ్యవసాయం చేస్తే ఇప్పుడు మాకేం లేదని వాపోయాడు.
మార్పు మార్పు అని అధికారంలోకి వచ్చిండు.. రాత్రింబవళ్లు గోస పడుతున్నం.. ఇక్కడేమో ఎవరూ వడ్లు కొనేటోడు లేడు.. యూట్యూబ్ చానళ్లు, మెయిన్ స్ట్రీమ్ చానళ్లు కూడా వడ్లు క్వింటాల్‌కు రూ.3500 అని చెప్పినయ్.. నా దగ్గర 50 క్వింటాళ్ల వడ్లున్నాయి.. కోసి కుప్ప పోసిన.. ఇంకో మూడెకరాలు కోసేందుకు రెడీగా ఉంది రండి ఓ సారి.. ధర రూ.2600, రూ.2700 కంటే ఎక్కువ పెడ్తలేరు.. మహిళా సంఘాలు లేనిది బోనస్ ఎక్కడి నుంచి వస్తదన్నాడు.
మహిళలకు కోటీశ్వరులను చేసుడు పక్కకు పెడితే.. వాళ్లను బికారీలను చేయకుండా ఉన్న పుస్తెలతాళ్లు అమ్ముకోకుండా చేయమను చాలు.. అప్పులు తెచ్చి వ్యవసాయం చేస్తే మాకు ఏం లేదు.. ఇప్పుడు కాదు.. ఓడిపోయిన తెల్లారి నుంచే.. తెల్లారి లేస్తే మాకు కేసీఆరే గుర్తొస్తరు అని చెప్పుకొచ్చాడు.
రేవంత్ రెడ్డి చెప్పేవన్నీ బోకర్ ముచ్చట్లే
మార్పు, మార్పు అని కాంగ్రెస్ పార్టీకి ఓటు వేసి గోస పడుతున్నాము
అప్పులు తెచ్చి వ్యవసాయం చేస్తే ఏమీ లేకుండా అయిపోయింది
రైతులకు నీళ్లు ఇవ్వకపోతే రేవంత్ రెడ్డి ఇంటి ముందు పురుగుల మందు డబ్బాతో కూర్చుంటాము
రేవంత్ రెడ్డికి ఓటు వేయించినందుకు ఇంటికి పోతే మా వాళ్లు కుక్కను తిట్టినట్లు తిడుతున్నారు
మూడేళ్ల నుంచి తెలంగాణను చంద్రబాబుకు ధారాదత్తం చేశాడు.
— Telugu Scribe (@TeluguScribe) November 28, 2026
Read Also :
Read Today's Latest Warangal-rural Warangal-rural News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Farmer | ‘రేవంత్ రెడ్డి చెప్పేవన్నీ బ్రోకర్ ముచ్చట్లే.. తెల్లారి లేస్తే మాకు కేసీఆరే గుర్తొస్తరు’
Annamayya Song | ఇంటర్నేషనల్ స్టేజ్‌పై మార్మోగిన అన్నమయ్య కీర్తన.. ‘బ్రహ్మమొక్కటే’ పాటకు గూస్బంప్స్..!
Businessman Arrest | ఆదిలాబాద్‌లో బినామీ పేర్లతో ఖాతాలు, పోర్జరీలకు పాల్పడ్డ ప్రముఖ వ్యాపారవేత్త అరెస్ట్
పోచంపల్లి కో-ఆపరేటివ్ అర్బన్ బ్యాంక్ సీఈవోకు బెస్ట్ సీఈవో అవార్డు
B Vinod Kumar | కాంగ్రెస్ పార్టీ చేసిన ద్రోహమే కేసీఆర్ ఆమరణదీక్షకు ప్రధాన కారణం : బోయినపల్లి వినోద్ కుమార్
ట్రెండింగ్ వార్తలు
Watch: పైనాపిల్స్ లోడ్‌తో వెళ్తున్న వాహనం బోల్తా.. తర్వాత ఏం జరిగిందంటే?
1 Woman 3 Nominations | స్థానిక సంస్థల ఎన్నికల్లో షాక్ ఇచ్చిన మహిళ.. మూడు దుస్తుల్లో మూడుసార్లు నామినేషన్
Offbeat | బీచ్‌లో గర్ల్‌ఫ్రెండ్‌కు డైమండ్ రింగ్‌తో ప్రపోజ్.. అంతలోనే రింగ్ మాయం.. ఏం జరిగిందంటే..!
Offbeat | పార్కులో ఒంటరిగా కూర్చున్న మహిళకు రూ.2,500 జరిమానా.. కారణం తెలిస్తే షాకవ్వాల్సిందే..!
Holiday list | 2027 కేంద్ర ప్రభుత్వ సెలవుల జాబితా విడుదల.. ఈ రోజుల్లో కేంద్ర కార్యాలయాలు క్లోజ్..!

