జలసిరి పనులు పరిశీలించిన డీఆర్డీఏ ఏపీడీ రమణ
బూర్గంపహాడ్ మండలం ఇరవెండి పంచాయతీలో జలసిరి కార్యక్రమంలో భాగంగా జరుగుతున్న పనులను డీఆర్డీఏ ఏపీడీ రమణ శనివారం పరిశీలించారు. పల్లె ప్రకృతి వనంలో నిర్మించిన నీటి తొట్టిని చూసి...
బూర్గంపహాడ్, నవంబర్ 28 : బూర్గంపహాడ్ మండలం ఇరవెండి పంచాయతీలో జలసిరి కార్యక్రమంలో భాగంగా జరుగుతున్న పనులను డీఆర్డీఏ ఏపీడీ రమణ శనివారం పరిశీలించారు. పల్లె ప్రకృతి వనంలో నిర్మించిన నీటి తొట్టిని చూసి ఏపీడీ సంతృప్తి వ్యక్తం చేశారు. మూగజీవాలు, పక్షుల దాహార్తి తీర్చడానికి ఇది ఎంతగానో ఉపయోగ పడుతుందన్నారు. గ్రామంలో జరుగుతున్న ఇంకుడు గుంతలు, పంట కుంటల నిర్మాణాలను పరిశీలించారు. ఎల్‌నినో ప్రభావంతో భూగర్భ జలాలు సైతం అడుగంటిపోయే ప్రమాదం ఉందని ఈ నేపధ్యంలో జలసిరిలో భాగంగా చేపడుతున్న పనులను పంచాయతీలో సమర్ధవంతంగా నిర్వహిస్తున్నందుకు సర్పంచ్ గుండి బాబూరావు, ఉప సర్పంచ్ మహంకాళి రామారావు, కార్యదర్శి స్పందనను ఆయన ప్రత్యేకంగా అభినందించారు. ఈ కార్యక్రమంలో పంచాయతీ సిబ్బంది పాల్గొన్నారు.
Read Today's Latest Khammam Khammam News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: పైనాపిల్స్ లోడ్‌తో వెళ్తున్న వాహనం బోల్తా.. తర్వాత ఏం జరిగిందంటే?
1 Woman 3 Nominations | స్థానిక సంస్థల ఎన్నికల్లో షాక్ ఇచ్చిన మహిళ.. మూడు దుస్తుల్లో మూడుసార్లు నామినేషన్
Offbeat | బీచ్‌లో గర్ల్‌ఫ్రెండ్‌కు డైమండ్ రింగ్‌తో ప్రపోజ్.. అంతలోనే రింగ్ మాయం.. ఏం జరిగిందంటే..!
Offbeat | పార్కులో ఒంటరిగా కూర్చున్న మహిళకు రూ.2,500 జరిమానా.. కారణం తెలిస్తే షాకవ్వాల్సిందే..!
Holiday list | 2027 కేంద్ర ప్రభుత్వ సెలవుల జాబితా విడుదల.. ఈ రోజుల్లో కేంద్ర కార్యాలయాలు క్లోజ్..!

