Varanasi | మహేష్ బాబు బర్త్‌డే స్పెషల్.. ‘రుద్ర’ రూపం, ఆఫ్రికా అడవుల విశేషాలు వెల్లడించిన రాజమౌళి!
Mahesh Babu | మహేష్ బాబు పుట్టినరోజు సందర్భంగా టాలీవుడ్ మోస్ట్ అవేటెడ్ ప్రాజెక్ట్‌కు సంబంధించి రాజమౌళి సోషల్ మీడియా వేదికగా కీలక అప్డేట్ ఇచ్చారు.
Mahesh Babu | మహేష్ బాబు పుట్టినరోజు సందర్భంగా టాలీవుడ్ మోస్ట్ అవేటెడ్ ప్రాజెక్ట్‌కు సంబంధించి రాజమౌళి సోషల్ మీడియా వేదికగా కీలక అప్డేట్ ఇచ్చారు. ఈ సినిమాలోని ‘రుద్ర’ పాత్ర గురించి ఆయన మాట్లాడుతూ.. “రుద్ర కేవలం తన కోసం కాకుండా, ఒక గొప్ప ఉద్దేశాన్ని నెరవేర్చడానికి పుట్టాడు. అతను కోరుకోని ఒక గమ్యాన్ని తనతో పాటు మోస్తున్నాడు. అతను చమత్కారంగా, సున్నితంగా, అలాగే భయంకరంగా ఉంటాడు. మహేష్ బాబు ఆ పాత్రకు ప్రాణం పోశారు. ఎవరైనా ఉగ్రరూపం ప్రదర్శించగలరు, కానీ ఒకే సమయంలో భయంకరంగా మరియు పెళుసైన భావోద్వేగాలను పండించడం చాలా కొద్ది మందికే సాధ్యం” అని తెలిపారు.
అలాగే ఆఫ్రికా షెడ్యూల్ విశేషాలను పంచుకుంటూ.. “ఈ విజువల్స్ మా ఆఫ్రికా షెడ్యూల్లోనివి. ఏ సెట్ కూడా ఇవ్వలేని అద్భుతమైన అనుభూతిని ఈ భూమి మాకు అందించింది. కిలిమంజారో పరిసరాల్లో, మసాయి మారా అడవులలో షూటింగ్ చేస్తుంటే మైమరచిపోయాను. కొన్ని ఉదయాపూట మా కళ్లముందు ఉన్న అందాన్ని 1.43:1 ఐమాక్స్ ఫ్రేమ్ కూడా పూర్తిగా బంధించలేదేమో అనిపించింది” అంటూ జక్కన్న భావోద్వేగానికి లోనయ్యారు. ఈ పోస్ట్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
రైతులు యాసంగిలో వరి వేయొద్దు : దాసరి హరిచందన
మేడిగడ్డ దగ్గర బాంబ్ పేలిన శబ్దం వచ్చింది..! దీనిపై విచారణ జరపాలి : మాజీ ఈఎన్సీ మురళీధర్ రావు
Multi Starrer | ఎన్టీఆర్, అల్లు అర్జున్‌తో నెల్సన్ భారీ మల్టీస్టారర్.. కథ కూడా వినిపించారా?
Maruti Patel Dongre | ప్రభుత్వ వైఫల్యంతోనే ఎండిపోతున్న పంటలు : మారుతి పటేల్ డోంగ్రే
‘క్యాన్సర్‌ను తొలి దశలోనే గుర్తిస్తే సంపూర్ణ చికిత్స’
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

