నాగారం, మార్చి 10 : ఎస్సారెస్పీ నీటిని విడుదల చేయాలంటూ మంగళవారం నాగారం మండల కేంద్రంలోని సూర్యాపేట-జనగామ ప్రధాన రహదారిపై రైతులు రాస్తారోకో నిర్వహించారు. ఎస్సారెస్పీ కాల్వపై ప్రధానంగా ఆధారపడి వ్యవసాయ సాగు చేస్తున్న తమకు పొట్ట దశకు వచ్చి వరి చేన్లు మొత్తం ఎండిపోతున్నాయని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వం వెంటనే స్పందించి ఎస్సారెస్పీ నీటిని విడుదల చేసి రైతాంగాన్ని ఆదుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో రైతులు వడ్లకొండ వెంకన్న, కేశగాని అంజయ్య, నరాల మల్లయ్య, జటంగి అంజయ్య, శ్రీకాంత్, బొంగు సతీష్, జటంగి జాన్, కడారి వినయ్, పురుషోత్తం, లింగాల మల్లయ్య, అంజయ్య, బొంగు రమేశ్, శ్రీను, లింగస్వామి పాల్గొన్నారు.