Running | ఆరోగ్యానికి ఎంతో మేలు చేసే రన్నింగ్.. కొత్తగా ప్రారంభించేవారు తెలుసుకోవాల్సిన విషయాలు ఇవే..
పరుగెత్తడం శారీరక దృఢత్వాన్ని పెంచడంతోపాటు గుండె ఆరోగ్యాన్ని మెరుగుపరచే అత్యంత సులభమైన వ్యాయామాల్లో ఒకటి. క్రమం తప్పకుండా పరుగెత్తడం వల్ల శరీర సహనశక్తి పెరగడమే కాకుండా, టైప్ 2 డయాబెటిస్, పక్షవాతం వంటి వ్యాధుల ప్రమాదం తగ్గే అవకాశం ఉంటుంది.
Running | పరుగెత్తడం శారీరక దృఢత్వాన్ని పెంచడంతోపాటు గుండె ఆరోగ్యాన్ని మెరుగుపరచే అత్యంత సులభమైన వ్యాయామాల్లో ఒకటి. క్రమం తప్పకుండా పరుగెత్తడం వల్ల శరీర సహనశక్తి పెరగడమే కాకుండా, టైప్ 2 డయాబెటిస్, పక్షవాతం వంటి వ్యాధుల ప్రమాదం తగ్గే అవకాశం ఉంటుంది. అలాగే మానసిక ఒత్తిడి తగ్గి రోజంతా ఉత్సాహంగా ఉండేందుకు కూడా ఇది సహాయపడుతుంది. అయితే మొదటిసారి రన్నింగ్ ప్రారంభించేవారు కొన్ని ముఖ్యమైన విషయాలను తెలుసుకుని ముందుకు సాగితే గాయాల ప్రమాదం తగ్గి మంచి ఫలితాలు పొందవచ్చు.పరుగెత్తడం ప్రారంభించే ముందు సరైన రన్నింగ్ షూస్‌ను ఎంపిక చేసుకోవడం చాలా ముఖ్యం. ప్రతి ఒక్కరి పాదాల ఆకృతి, నడక తీరు భిన్నంగా ఉంటుంది. అందుకే రన్నింగ్‌కు అనువైన షూస్ ను నిపుణుల సలహాతో ఎంపిక చేసుకుంటే పాదాలు, చీలమండలు, మోకాళ్లపై అనవసర ఒత్తిడి పడకుండా ఉంటుంది.
దుస్తులు, సమయం..
రన్నింగ్ సమయంలో ధరించే దుస్తులు కూడా పనితీరుపై ప్రభావం చూపుతాయి. చెమటను త్వరగా బయటకు పంపే సింథటిక్ ఫ్యాబ్రిక్‌తో తయారైన దుస్తులు ఉపయోగించడం మంచిది. పూర్తిగా కాటన్‌తో తయారైన దుస్తులు చెమటను నిల్వ ఉంచి చర్మం చికాకు, వాపులు వంటి సమస్యలకు కారణమయ్యే అవకాశం ఉంటుంది. ప్రారంభంలోనే ఒక స్పష్టమైన ప్రణాళికను రూపొందించుకోవాలి. మొదట ఒక నిమిషం పరుగెత్తి, ఐదు నిమిషాలు నడిచే విధానంతో ప్రారంభించడం ఉత్తమం. క్రమంగా శరీరం అలవాటు పడిన తర్వాత పరుగెత్తే సమయాన్ని పెంచుకోవచ్చు. ముఖ్యంగా రూపొందించుకున్న ప్రణాళికను క్రమం తప్పకుండా పాటించడం విజయానికి కీలకం. మొదటి రోజే ఎక్కువ దూరం లేదా ఎక్కువ సమయం పరుగెత్తేందుకు ప్రయత్నించకూడదు. చిన్న చిన్న వ్యవధులతో ప్రారంభించి, తర్వాత క్రమంగా దూరాన్ని, వేగాన్ని పెంచుకోవాలి. చాలా వేగంగా ప్రారంభించడం వల్ల మోకాళ్లు, చీలమండలపై ఒత్తిడి పెరిగి గాయాలకు అయ్యే ప్రమాదం ఉంటుంది.
తగినంత నీరు అవసరం..
రన్నింగ్ చేసే ముందు శరీరంలో తగినంత నీరు ఉండేలా చూసుకోవాలి. పరుగెత్తడానికి రెండు గంటల ముందు కనీసం అర లీటర్ నీరు తాగడం మంచిది. ఎక్కువసేపు పరుగెత్తే సమయంలో కూడా అవసరాన్ని బట్టి నీరు తాగడం వల్ల డీహైడ్రేషన్ సమస్య రాకుండా ఉంటుంది. పరుగెత్తే ముందు వార్మప్ చేయడం తప్పనిసరి. ఐదు నిమిషాలు నడవడం లేదా తేలికపాటి స్ట్రెచింగ్, వార్మప్ వ్యాయామాలు చేయడం ద్వారా కండరాలు సడలిపోతాయి. దీంతో గాయాల ప్రమాదం తగ్గి శరీరం పరుగుకు సిద్ధమవుతుంది. రన్నింగ్‌తోపాటు విశ్రాంతి కూడా అంతే అవసరం. వ్యాయామం చేసిన తర్వాత కండరాలు కోలుకోవడానికి శరీరానికి సమయం ఇవ్వాలి. ప్రారంభ దశలో ఒక రోజు పరుగెత్తి, మరుసటి రోజు విశ్రాంతి తీసుకోవడం మంచిదని నిపుణులు సూచిస్తున్నారు.
ఇతర వ్యాయామాలు కూడా చేస్తే..
రన్నింగ్‌తో పాటు ఇతర వ్యాయామాలు కూడా చేయడం ఉపయోగకరం. సైక్లింగ్, ఈత, యోగా లేదా ఇతర క్రీడల్లో పాల్గొనడం వల్ల శరీర సమతుల్యత మెరుగుపడుతుంది. అలాగే ఒకే రకమైన వ్యాయామం వల్ల కండరాలపై పడే ఒత్తిడి కూడా తగ్గుతుంది. కొన్ని రోజులు అలసటగా అనిపించినా లేదా బద్ధకంగా ఉన్నా రన్నింగ్‌ను పూర్తిగా మానేయకూడదు. ఒక రోజు వాయిదా వేయడం అలవాటై, తర్వాత పూర్తిగా ఆపివేసే పరిస్థితి రావచ్చు. అందుకే క్రమశిక్షణతో వ్యాయామాన్ని కొనసాగించడం చాలా ముఖ్యం. ఎప్పుడూ ఒకే విధంగా పరుగెత్తకుండా అప్పుడప్పుడు మార్పులు చేసుకోవాలి. కొన్నిసార్లు స్ప్రింట్లు, మరికొన్నిసార్లు నెమ్మదిగా జాగింగ్ చేయడం మంచిది. అలాగే ప్రతిరోజూ ఒకే ప్రదేశంలో కాకుండా పార్కులు, కొండ ప్రాంతాలు వంటి కొత్త ప్రదేశాల్లో పరుగెత్తడం వల్ల ఆసక్తి పెరగడంతోపాటు సహనశక్తి, కండరాల బలం కూడా మెరుగుపడుతుందని నిపుణులు సూచిస్తున్నారు.
Read Today's Latest Health News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
India vs Zimbabwe | షఫాలీ సునామీ.. స్మృతి మంధాన మెరుపు ఫినిషింగ్.. 8.5 ఓవర్లలోనే జింబాబ్వేపై టీమిండియా విధ్వంసం!
Bathukamma | రాష్ట్రంలో ఘనంగా బతుకమ్మ సంబరాలు.. Videos
Bathukamma | పండుగ పూట కరెంట్ కోతలు.. చీకట్లోనే బతుకమ్మ ఆడిన మహిళలు
Tiger Shroff | బాలీవుడ్ నటుడు టైగర్ ష్రాఫ్‌పై కాల్పులు.. సల్మాన్ ఖాన్‌తో పనిచేసే వారే టార్గెట్?
Lal Hit Janata Party | సీజేపీకి వ్యతిరేకంగా.. ‘లాల్ హిట్ జనతా పార్టీ’ ఏర్పాటు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

