ఆరోగ్యశాఖలో షోకాజ్ నోటీసుల రగడ!
రాష్ట్ర వైద్యారోగ్య శాఖలో ఉద్యోగులకు షోకాజ్ నోటీసులు తీవ్ర కలకలం రేపాయి. ఉద్యోగుల హాజరు విధానంలో పారదర్శకత తీసుకొచ్చేందుకు సరికొత్త సాంకేతికత పేరిట తీసుకొచ్చిన ‘మీ ప్రమాణం’ యాప్‌లో గైర్హాజరు అయ్యారనే కారణంతో రాష్ట్ర వ్యాప్తంగా 4,454 మంది ఉద్యోగులకు వైద్య శాఖ ఉన్నతాధికారులు షోకాజ్ నోటీసులు జారీచేశారు. వీరిలో డీఎంహెచ్‌వో పరిధిలో (413), యూ పీహెచ్సీ (998), బస్తీ దవాఖాన(369), పీహెచ్సీ(2674) ఉద్యోగులకు అధికారులు నోటీసులు జారీ చేశారు.
- రాష్ట్రవ్యాప్తంగా 4,454 మంది ఉద్యోగులకు నోటీసులు
- ‘మీ ప్రమాణం’ యాప్‌లో గైర్హాజరుతో చర్యలు
- మ్యాపింగ్ చేయకుండా.. షోకాజ్ నోటీసులా..?
- యాప్ అమలు తీరుపై ఆగ్రహం
హైదరాబాద్, నవంబర్ 24 (నమస్తే తెలంగాణ): రాష్ట్ర వైద్యారోగ్య శాఖలో ఉద్యోగులకు షోకాజ్ నోటీసులు తీవ్ర కలకలం రేపాయి. ఉద్యోగుల హాజరు విధానంలో పారదర్శకత తీసుకొచ్చేందుకు సరికొత్త సాంకేతికత పేరిట తీసుకొచ్చిన ‘మీ ప్రమాణం’ యాప్‌లో గైర్హాజరు అయ్యారనే కారణంతో రాష్ట్ర వ్యాప్తంగా 4,454 మంది ఉద్యోగులకు వైద్య శాఖ ఉన్నతాధికారులు షోకాజ్ నోటీసులు జారీచేశారు. వీరిలో డీఎంహెచ్‌వో పరిధిలో (413), యూ పీహెచ్సీ (998), బస్తీ దవాఖాన(369), పీహెచ్సీ(2674) ఉద్యోగులకు అధికారులు నోటీసులు జారీ చేశారు.
ఉన్నతాధికారులకు ఎలాంటి ముందస్తు సమాచారం లేకుండా ఎలా గైర్హాజరు అయ్యారో సమగ్ర వివరణ ఇవ్వాలని నోటీసుల్లో ఆదేశించారు. క్షేత్రస్థాయిలో మ్యాపింగ్ లేకుండానే ‘మీ ప్రమాణం’ యాప్ తీసుకొచ్చి గైర్హాజరు అయ్యారని ఉద్యోగులకు నోటీసులు ఇవ్వడం పట్ల ఉద్యోగ సంఘాలు తీవ్ర స్థాయిలో మండిపడుతున్నా యి. ప్రభుత్వ దవాఖానల్లో కొంతమంది వై ద్యులు, సిబ్బంది సమయపాలన పాటించడం లేనందున, పారదర్శకత పెంచేందుకు తీసుకొచ్చిన ఈ యాప్‌ను తాము వ్యతిరేకించడం లేదని ఉద్యోగ సంఘాలు పేర్కొంటున్నాయి.
మ్యాపింగ్ లేకపోతే.. హాజరు ఎలా..?
క్షేత్రస్థాయి సిబ్బంది, సబ్సెంటర్లను మ్యాపింగ్ చేయకుండానే ఉన్నతాధికారులు షోకాజ్ నోటీసుల పేరిట ఉద్యోగుల ఆత్మైస్థెర్యాన్ని దెబ్బతీయడం ఏమిటని ఉద్యోగ సంఘాలు మండిపడుతున్నాయి. మొదట పీహెచ్సీ సిబ్బందికి మాత్రమే యాప్ అమలు చేశారని, తర్వాత ప్రతి ఉద్యోగి యాప్‌లో రిజిస్టర్ చేసుకోవాలని అధికారులు ఆదేశించారని గుర్తుచేశారు. ఉన్నతాధికారుల ఆదేశాలతో ఆయా క్యాడర్ల ఉద్యోగులు ఈ యాప్‌లో రిజిస్టర్ చేసుకున్నారు. కాగా, సబ్‌సెంటర్లు, ఆయుష్మాన్ ఆరోగ్య మందిరాలు(ఏఏఎమ్) యాప్ లో మ్యాపింగ్ కాలేదని తెలిపాయి.
మ్యాపింగ్ లేకపోతే హాజరు వేయడం అసాధ్యమని గుర్తుచేశాయి. అయినా షోకాజ్ నోటీసులు ఇవ్వ డంపై ఆగ్రహం వ్యక్తంచేస్తున్నాయి. వైద్యారోగ్యశాఖలో క్షేత్రస్థాయి సిబ్బందికి ఇబ్బందులు తలెత్తకుండా సబ్‌సెంటర్లు, ఆమ్(ఏఏఎమ్) కేంద్రాలను యాప్‌లో వెంటనే మ్యాపింగ్ చేసి, యాక్సెస్ ఇవ్వాలని ఉద్యోగ సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. మ్యాపింగ్ పూర్తయ్యే వరకు జారీచేసిన షోకాజ్ నోటీసులన్నీ ఉపసంహరించుకోవాలని కోరాయి. గ్రామాలకు వెళ్లే ఏఎన్ఎం, సూపర్వైజర్లకు ఫీల్డ్ డ్యూటీ, టీకా డ్యూటీ ఆప్షన్లు ఇవ్వాలని విన్నవించాయి. యాప్‌లో ఉన్న లోపాలను వెంటనే సరిచేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశాయి.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Rahul Gandhi | నా తండ్రిని చంపడానికే ఆయన భద్రతను తొలగించారు.. అప్పటి కేంద్ర సర్కారుపై రాహుల్‌గాంధీ ఆరోపణ..!
Watch: ఇద్దరు వరులను ఆశ్చర్యపరిచిన బావ.. కోటి విలువైన కరెన్సీ దండలు బహూకరణ
Watch: అసదుద్దీన్ ఒవైసీని సుప్రీంకోర్టు జడ్జిగా పొరబడిన పోలీసులు.. గౌరవ వందనం సమర్పణ
Watch: ఆసుపత్రిలో నిద్రిస్తున్న మహిళను వేధించిన వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: వైద్య విద్యార్థినిని.. కాలేజీ క్యాంపస్ నుంచి కిడ్నాప్ చేసిన కుటుంబ సభ్యులు, వీడియో వైరల్

