మహిళా బిల్లు ద్వారా డీలిమిటేషన్‌కు బీజేపీ కుట్ర
లోక్‌సభ నియోజకవర్గాల పునర్విభజనలో ప్రతి రాష్ర్టానికి 50 శాతం సీట్లు పెంచుతామంటున్న బీజేపీ మాటలు నమ్మవద్దని రాజ్యసభ సభ్యుడు కపిల్ సిబల్ ప్రతిపక్ష పార్టీల్ని అభ్యర్థించారు. అందుకే వర్షాకాల సమావేశాల్ని వాయిదా వెయ్యకుండా బిల్లు ఆమోదం పొందటానికి కావాల్సిన 362 సభ్యుల మద్దతు కోసం బీజేపీ చూస్తోందన్నారు. జనగణన తర్వాత 2027లో రాజ్యాంగ సవరణ ద్వారా నియోజకవర్గాల పునర్విభజన చేసే అవకాశం ఉన్నప్పటికీ, ప్రస్తుతమున్న సీట్లకు అదనంగా యాభై శాతం సీట్లు పెంచుతామని రాష్ర్టాలను బీజేపీ మభ్యపెడుతోంది అని సిబల్ ప్రెస్ మీట్లో వివరించారు.
- ఎంపీ సీట్ల పెంపు హామీకి ప్రతిపక్ష పార్టీలు లొంగవద్దు
- రాజ్యసభ ఎంపీ సిబల్ అభ్యర్థన
న్యూఢిల్లీ: లోక్‌సభ నియోజకవర్గాల పునర్విభజనలో ప్రతి రాష్ర్టానికి 50 శాతం సీట్లు పెంచుతామంటున్న బీజేపీ మాటలు నమ్మవద్దని రాజ్యసభ సభ్యుడు కపిల్ సిబల్ ప్రతిపక్ష పార్టీల్ని అభ్యర్థించారు. అందుకే వర్షాకాల సమావేశాల్ని వాయిదా వెయ్యకుండా బిల్లు ఆమోదం పొందటానికి కావాల్సిన 362 సభ్యుల మద్దతు కోసం బీజేపీ చూస్తోందన్నారు. జనగణన తర్వాత 2027లో రాజ్యాంగ సవరణ ద్వారా నియోజకవర్గాల పునర్విభజన చేసే అవకాశం ఉన్నప్పటికీ, ప్రస్తుతమున్న సీట్లకు అదనంగా యాభై శాతం సీట్లు పెంచుతామని రాష్ర్టాలను బీజేపీ మభ్యపెడుతోంది అని సిబల్ ప్రెస్ మీట్లో వివరించారు.
ప్రస్తుతం తమిళనాడుకున్న 39 సీట్లు 59కి, ఉత్తరప్రదేశ్‌కు ఉన్న 80 సీట్లు 120కి పెరుగుతాయన్న ఆయన… తమిళనాడు, యూపీ మధ్య ప్రస్తుతమున్న తేడాకు పునర్విభజన తర్వాత ఉన్న తేడాకు చాలా వ్యత్యాసం ఉంటుందన్నారు. ఈ విధానం వల్ల బీజేపీ అధికారంలో ఉన్న ఉత్తరాది రాష్ర్టాల్లో సీట్లు పెరుగుతాయని చెప్పారు. గతంలో అస్సాం, జమ్ము కశ్మీర్లో ఇలాగే పునర్విభజన చేశారన్నారు. ఈ బిల్లు ఆమోదం పొందితే ఆయా రాష్ర్టాల్లో శాశ్వతంగా బీజేపీ అధికారంలో ఉంటుందని, డీలిమిటేషన్ చట్టం నిర్ణయాల్ని కోర్టుల్లో సవాలు చేసే అవకాశం లేదన్నారు. ప్రతిపక్ష పార్టీలు బీజేపీ ప్రతిపాదనకు తలొగ్గితే దేశంలో ప్రజాస్వామ్యానికి పెను ముప్పు వాటిల్లుతుందన్నారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Rahul Gandhi | నా తండ్రిని చంపడానికే ఆయన భద్రతను తొలగించారు.. అప్పటి కేంద్ర సర్కారుపై రాహుల్‌గాంధీ ఆరోపణ..!
Watch: ఇద్దరు వరులను ఆశ్చర్యపరిచిన బావ.. కోటి విలువైన కరెన్సీ దండలు బహూకరణ
Watch: అసదుద్దీన్ ఒవైసీని సుప్రీంకోర్టు జడ్జిగా పొరబడిన పోలీసులు.. గౌరవ వందనం సమర్పణ
Watch: ఆసుపత్రిలో నిద్రిస్తున్న మహిళను వేధించిన వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: వైద్య విద్యార్థినిని.. కాలేజీ క్యాంపస్ నుంచి కిడ్నాప్ చేసిన కుటుంబ సభ్యులు, వీడియో వైరల్

