‘టెమ్రిస్’పై కాంగ్రెస్ సర్కార్ కత్తి!
నిరుపేద మైనారిటీ విద్యార్థులకు నాణ్యమైన విద్యనందించాలనే సమున్నత లక్ష్యంతో కేసీఆర్ సర్కార్ ఏర్పాటుచేసిన మైనారిటీ గురుకులాల (టెమ్రిస్)పై కాంగ్రెస్ సర్కార్ కత్తిగట్టింది.
- యంగ్ ఇండియాలో మైనారిటీ గురుకులాల విలీనానికి నిర్ణయం
- వచ్చే ఏడు తొలిదశ 105స్కూళ్లను కలుపాలని రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయం
- 75% ప్రత్యేక కోటాపై సందిగ్ధం
- ఆందోళనలో విద్యార్థులు, ఉద్యోగులు
- మైనారిటీ సంఘాల తీవ్ర అభ్యంతరం
- వెనక్కి తీసుకోవాలని డిమాండ్
హైదరాబాద్, నవంబర్ 24 (నమస్తేతెలంగాణ): నిరుపేద మైనారిటీ విద్యార్థులకు నాణ్యమైన విద్యనందించాలనే సమున్నత లక్ష్యంతో కేసీఆర్ సర్కార్ ఏర్పాటుచేసిన మైనారిటీ గురుకులాల (టెమ్రిస్)పై కాంగ్రెస్ సర్కార్ కత్తిగట్టింది. కొత్తగా ప్రారంభించనున్న యంగ్ ఇండియా ఇంటిగ్రెటెడ్ స్కూళ్లలో విలీనం చేసి వాటి ఉనికికే ముప్పు తెవాలని చూస్తున్నది. మైనారిటీ గురుకుల సొసైటీనే రద్దుచేసి ఆ స్కూళ్లను యంగ్ ఇండియా విద్యాసంస్థల్లో కలుపడం ద్వారా ఎదురయ్యే సమస్యలను పట్టించుకోకుండా సర్కార్ మొండిగా ముందుకెళ్తున్నది.
విద్యార్థులు, ఉద్యోగుల అభ్యంతరాలను బేఖాతరు చేస్తున్నది. మైనారిటీ వర్గాల విన్నపాలను ప్రభుత్వం బుట్టదాఖలు చేస్తూ ముందుకే వెళ్తున్నది. మైనారిటీ గురుకులాలను విడతలవారీగా విలీనం చేయాలని నిర్ణయించి ఆ దిశగా చకచకా అడుగులు వేస్తున్నది. మొత్తం 204 మైనార్టీ గురుకులాలు ఉండగా 2027-28 విద్యాసంవత్సరంలో 105 పాఠశాలలను విలీనం చేసి, ఆ తర్వాత విద్యాసంవత్సరంలో మిగిలిన స్కూళ్లను సైతం ఒకే గొడుకు కిందకు తేవాలని నిర్ణయించినట్టు తెలుస్తున్నది.
విద్యార్థులు, ఉద్యోగుల భవిష్యత్తు అగమ్యగోచరం
మైనారిటీ సొసైటీ పరిధిలో కొనసాగుతున్న విద్యాసంస్థలను యంగ్ ఇండియా స్కూళ్లలో కలుపాలని ప్రభుత్వం నిర్ణయించడంపై ఆ స్కూళ్ల విద్యార్థులు, అందులో పనిచేస్తున్న ఉద్యోగులు, సిబ్బందిలో ఆందోళన నెలకొన్నది. మైనారిటీ గురుకులాల్లోని విద్యార్థులకు వారి మతపరమైన ఆచారాలకు ప్రత్యేకమైన ఏర్పాట్లు ఉండేవి. సంప్రదాయ దుస్తులు ధరించడం, ప్రార్థనలు చేయడం ఇతర కట్టుబాట్లను వారు అనుసరించేవారు. అలాగే బోధనా పద్ధతులను వారికి అనుకూలంగా రూపొందించారు. యంగ్ ఇండియాలో విలీనం చేస్తే తమకు ఇబ్బందులు ఎదురవుతాయని విద్యార్థులు తీవ్ర ఆందోళనకు గురువుతున్నారు.
ప్రస్తుతం పనిచేస్తున్న ఉద్యోగులు, ముఖ్యంగా ఔట్ సోర్సింగ్ సిబ్బంది తమ ఉద్యోగాలు ఊడిపోతాయని మదనపడుతున్నారు. ప్రభుత్వం మాత్రం తమ ఇబ్బందులను, అభ్యంతరాలను పరిగణనలోకి తీసుకోవడమే లేదని ఆవేదన వ్యక్తంచేస్తున్నారు. మైనారిటీ గురుకులాలను యథావిథిగా ఉంచాలని ప్రభుత్వానికి విన్నవించినా పట్టించుకోకపోవడంతో గత్యంతరంలేని పరిస్థితుల్లో ఉద్యమానికి శ్రీకారం చుడతామని మైనారిటీ ఫైనాన్స్ కార్పొరేషన్ మాజీ చైర్మన్ ఇంతియాజ్ అహ్మద్ హెచ్చరించారు.
సర్కార్‌ది అనాలోచిత నిర్ణయం
మైనారిటీ గురుకులాలను యంగ్ ఇండియా స్కూళ్లలో విలీనం చేయాలనేది కాంగ్రెస్ సర్కార్ అనాలోచిత నిర్ణయం. ఈ విషయమై రాష్ట్రంలోని మైనారిటీ సంఘాల ప్రతినిధులతో కనీసం చర్చించకుండా మొండిగా ముం దుకెళ్లడం దురదృష్టకరం. మైనారిటీ గురుకులాలను యంగ్ ఇండియా స్కూ ళ్లలో విలీనం చేయకుండా యథావిథిగా కొనసాగించాలి. గత ప్రభుత్వంపై కోపంతో నిరుపేద మైనారిటీ వర్గాల పిల్లలను ఇబ్బందులు పెట్టడం భావ్యం కాదు. వెంటనే ప్రభుత్వం మైనారిటీ గురుకులాల విలీన ప్రతిపాదనలను విరమించుకోవాలి. లేదంటే మైనారిటీల ఆగ్రహానికి గురికాక తప్పదు.
– యాకూబ్ పాషా, మైనారిటీ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Rahul Gandhi | నా తండ్రిని చంపడానికే ఆయన భద్రతను తొలగించారు.. అప్పటి కేంద్ర సర్కారుపై రాహుల్‌గాంధీ ఆరోపణ..!
Watch: ఇద్దరు వరులను ఆశ్చర్యపరిచిన బావ.. కోటి విలువైన కరెన్సీ దండలు బహూకరణ
Watch: అసదుద్దీన్ ఒవైసీని సుప్రీంకోర్టు జడ్జిగా పొరబడిన పోలీసులు.. గౌరవ వందనం సమర్పణ
Watch: ఆసుపత్రిలో నిద్రిస్తున్న మహిళను వేధించిన వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: వైద్య విద్యార్థినిని.. కాలేజీ క్యాంపస్ నుంచి కిడ్నాప్ చేసిన కుటుంబ సభ్యులు, వీడియో వైరల్

