ఓపీఎస్‌పై ఉద్యోగులకు వెన్నుపోటు
రాష్ట్రంలో 2003 నాటి నోటిఫికేషన్ల ద్వారా 2004లో నియామకపత్రాలు పొందిన వేలమందికి ఉద్యోగులు పాత పెన్షన్ పథకానికి (సీపీఎస్) దూరమయ్యారు.
- కాంగ్రెస్ సర్కార్ నయవంచన
- హైకోర్టు తీర్పును సవాల్ చేస్తూ సుప్రీం కోర్టులో పిటిషన్
- 2004కు ముందు నియమితులైన ఉద్యోగులకుసీపీఎస్ నుంచి విముక్తి కల్పించిన ఏపీ సర్కార్
- తెలంగాణలో మాత్రం ఇంకా తప్పని ఎదురుచూపులు
హైదరాబాద్, నవంబర్ 24 (నమస్తే తెలంగాణ): రాష్ట్రంలో 2003 నాటి నోటిఫికేషన్ల ద్వారా 2004లో నియామకపత్రాలు పొందిన వేలమందికి ఉద్యోగులు పాత పెన్షన్ పథకానికి (సీపీఎస్) దూరమయ్యారు. బలవంతంగా కాంట్రిబ్యూటరీ పెన్షన్ పథకం (సీపీఎస్)లోకి నెట్టబడిన ఈ ఉద్యోగులకు ఓపీఎస్ అమలు చేస్తామని హామీ ఇచ్చి గద్దెనెక్కిన కాంగ్రెస్ సర్కార్ మూడేండ్లుగా మోసగిస్తున్నది. దీనిపై ఆ ఉద్యోగులంతా మండిపడుతున్నారు. ఏపీలో 2004కు ముందు నోటిఫికేషన్ల ద్వారా నియమితులైన వారికి తాజాగా చంద్రబాబు నాయుడు ప్రభుత్వం పాత పెన్షన్‌ను వర్తింపజేస్తున్నది. డీఎస్సీ-2003 టీచర్లకు ఓపీఎస్‌ను వర్తింపజేస్తూ ఏపీ పాఠశాల విద్యాశాఖ ఈ నెల 21న జీవో జారీచేసింది.
కానీ, అదే నోటిఫికేషన్ ద్వారా నియమితులైన తెలంగాణ ఉద్యోగులకు మాత్రం ఎదరుచూపులు తప్పడంలేదు. దీంతో తమకు ఓపీఎస్‌ను ఎప్పుడు అమలు చేస్తారని తెలంగాణలోని ఉద్యోగులు, టీచర్లు ప్రశ్నిస్తున్నారు. రాష్ట్రంలో 2004 సెప్టెంబర్ 1 నుంచి సీపీఎస్ అమల్లోకి వచ్చింది. కానీ, 2003లో వెలువడిన పలు నోటిఫికేషన్లకు సంబంధించిన నియామకాలు 2004, 2005లో పూర్తయ్యాయి. ఆ ఉద్యోగులకు సంబంధిత నోటిఫికేషన్లను కాకుండా పోస్టింగ్ తేదీని ప్రామాణికంగా తీసుకుని సీపీఎస్‌ను అమలు చేశారు. దీంతో ప్రభుత్వ తప్పిదానికి మూల్యం చెల్లిస్తున్న ఆ ఉద్యోగులంతా న్యాయం కోసం పోరాడుతున్నారు.
ఈ నేపథ్యంలో డీఎస్సీ-2003 టీచర్లతోపాటు ఇతర ఉద్యోగులకు ఓపీఎస్ వర్తింపజేయాలని నిరుడు జూలై 29న హైకోర్టు తీర్పు ఇచ్చింది. కానీ, ఆ తీర్పు అమలు కాకపోవడంతో ఉద్యోగులు కోర్టు ధిక్కరణ పిటిషన్ దాఖలు చేశారు. అనంతరం ఓపీఎస్ అమలు చేయాలని హైకోర్టు డివిజన్ బెంచ్ సైతం తీర్పు ఇచ్చినప్పటికీ రేవంత్‌రెడ్డి ప్రభుత్వం అమలు చేయలేదు. పైగా హైకోర్టు తీర్పును సవాల్ చేస్తూ సుప్రీంకోర్టులో స్పెషల్ లీవ్ పిటిషన్ దాఖలు చేసింది. ఇది వెన్నుపోటు కిందికే వస్తుందని, కాంగ్రెస్ నిర్వాకం వల్ల తాము రిటైర్మెంట్ తర్వాత పలు ప్రయోజనాలను కోల్పోవాల్సి వస్తుందని ఉద్యోగులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
న్యాయమైన ఆకాంక్షను నెరవేర్చాలి
ఏపీలో 2004కు ముందు నియమితులైన ఉద్యోగులకు అక్కడి ప్రభుత్వం ఓపీఎస్ అమలు చేస్తున్నప్పటికీ తెలంగాణలో మాత్రం అమలు కావడంలేదు. ఓపీఎస్ అమలు చేస్తామంటూ అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా ఇచ్చిన హామీని కాంగ్రెస్ ప్రభుత్వం నెరవేర్చకపోగా హైకోర్టు తీర్పుపై సుప్రీంకోర్టులో పిటిషన్ వేసి మమ్మల్ని వెన్నుపోటు పొడిచింది. ఈ పిటిషన్‌ను వెంటనే ఉపసంహరించుకుని, మా న్యాయమైన ఆకాంక్షను నెరవేర్చాలి. లేకుంటే ఓపీఎస్ కోసం మా పోరాటాన్ని తీవ్రతరం చేస్తాం.
– దాముక కమలాకర్, సీపీఎస్ టీచర్స్ యూనియన్ రాష్ట్ర అధ్యక్షుడు
హైకోర్టు తీర్పును అమలు చేయాలి
పాత పెన్షన్ అమలు కోసం ఉద్యోగులంతా ఆశగా ఎదురుచూస్తున్నారు. సాక్షాత్తు ముఖ్యమంత్రి, డిప్యూటీ సీఎం హామీ ఇవ్వడంతో ఓపీఎస్ అమలుకు అధికారులు చర్యలు చేపడతారని మేమంతా భావించాం. హైకోర్టు డివిజన్ బెంచ్ తీర్పుతోనైనా పాత పెన్షన్ అమలవుతుందని నమ్మిన మాకు నిరాశే మిగిలింది. ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం పంతానికి పోకుండా హైకోర్టు తీర్పును అమలు చేయాలి. ఓపీఎస్‌ను పునరుద్ధరించడం ద్వారా ఉద్యోగులకు న్యాయం చేయాలి.
– హన్మాండ్ల భాస్కర్, సీపీఎస్ ఎంప్లాయీస్ అసొసియేషన్ ప్రధాన కార్యదర్శి
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Rahul Gandhi | నా తండ్రిని చంపడానికే ఆయన భద్రతను తొలగించారు.. అప్పటి కేంద్ర సర్కారుపై రాహుల్‌గాంధీ ఆరోపణ..!
Watch: ఇద్దరు వరులను ఆశ్చర్యపరిచిన బావ.. కోటి విలువైన కరెన్సీ దండలు బహూకరణ
Watch: అసదుద్దీన్ ఒవైసీని సుప్రీంకోర్టు జడ్జిగా పొరబడిన పోలీసులు.. గౌరవ వందనం సమర్పణ
Watch: ఆసుపత్రిలో నిద్రిస్తున్న మహిళను వేధించిన వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: వైద్య విద్యార్థినిని.. కాలేజీ క్యాంపస్ నుంచి కిడ్నాప్ చేసిన కుటుంబ సభ్యులు, వీడియో వైరల్

