Hot Beauty | గ్లామర్‌తో గత్తర లేపిన అప్సర రాణి.. ఆర్జీవీ ఫేవరెట్ హీరోయిన్ ఇప్పుడు ఎక్కడుంది?
Hot Beauty | సినీ పరిశ్రమలో చాలామంది హీరోయిన్లు ప్రారంభంలో మంచి జోరు చూపించి తర్వాత క్రమంగా సినిమాలకు దూరమవడం సహజమే. కొంతమంది పెళ్లి చేసుకుని ఇండస్ట్రీకి గుడ్‌బై చెబుతుంటే, మరికొందరు అవకాశాలు తగ్గడంతో మెల్లగా తెరపై కనిపించకుండా పోతారు. ఇలాంటి హీరోయిన్లలో ఒకరు అప్సర రాణి.
Hot Beauty | సినీ పరిశ్రమలో చాలామంది హీరోయిన్లు ప్రారంభంలో మంచి జోరు చూపించి తర్వాత క్రమంగా సినిమాలకు దూరమవడం సహజమే. కొంతమంది పెళ్లి చేసుకుని ఇండస్ట్రీకి గుడ్‌బై చెబుతుంటే, మరికొందరు అవకాశాలు తగ్గడంతో మెల్లగా తెరపై కనిపించకుండా పోతారు. ఇలాంటి హీరోయిన్లలో ఒకరు అప్సర రాణి. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఫోటోలలో కనిపిస్తున్న ఈ బ్యూటీని చాలా మంది వెంటనే గుర్తుపట్టలేకపోయినా, ఒకప్పుడు ఆమె యువతలో మంచి క్రేజ్ సంపాదించింది. తన అందం, గ్లామర్‌తో కుర్రకారును ఆకట్టుకున్న అప్సర రాణి కొంతకాలం టాలీవుడ్లో హాట్ టాపిక్‌గా నిలిచింది.అప్సర రాణి అసలు పేరు అంకేత మహారాణా. అయితే సినీ రంగంలోకి వచ్చిన తర్వాత ఆమె అప్సర రాణి అనే పేరుతో మంచి గుర్తింపు తెచ్చుకుంది. ముఖ్యంగా ప్రముఖ దర్శకుడు రామ్ గోపాల్ వర్మ దర్శకత్వంలో వచ్చిన సినిమాలతో ఆమెకు ప్రత్యేక గుర్తింపు వచ్చింది.
అప్సర రాణి హీరోయిన్గా మొదటిగా ‘4 లెటర్స్’ అనే సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైంది. ఆ తర్వాత తెలుగు, హిందీ భాషల్లో పలు సినిమాల్లో నటించి తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించింది. ముఖ్యంగా బోల్డ్ పాత్రల్లో నటించడంలో ఆమె వెనుకాడకపోవడం వల్ల త్వరగా పాపులారిటీ పొందింది. ప్రత్యేకంగా రామ్ గోపాల్ వర్మ తెరకెక్కించిన ‘డేంజర్’ సినిమాలో ఆమె నటన ప్రేక్షకుల దృష్టిని ఆకర్షించింది. ఆ సినిమాలో తన గ్లామర్‌తో పాటు నటనతో కూడా మంచి గుర్తింపు తెచ్చుకుంది. సినిమాలతో పాటు సోషల్ మీడియాలో కూడా అప్సర రాణి చాలా యాక్టివ్‌గా ఉంటుంది. తరచూ తన ఫోటోలు, వీడియోలు షేర్ చేస్తూ అభిమానులను అలరిస్తుంటుంది. ఆమె పోస్ట్ చేసే గ్లామర్ ఫోటోలు సోషల్ మీడియాలో తరచూ వైరల్ అవుతుంటాయి.
అయితే ఒకప్పుడు వరుస అవకాశాలు అందుకున్న ఈ బ్యూటీకి ప్రస్తుతం పెద్దగా సినిమా ఆఫర్లు రావడం లేదని తెలుస్తోంది. కొన్ని ప్రాజెక్టులు చర్చల్లో ఉన్నప్పటికీ పెద్దగా సినిమాల్లో కనిపించకపోవడంతో అభిమానులు కూడా ఆమె రీఎంట్రీ కోసం ఎదురు చూస్తున్నారు. గ్లామర్‌తో ప్రేక్షకులను ఆకట్టుకున్న అప్సర రాణి మళ్లీ పెద్ద సినిమాలతో తిరిగి రావాలని అభిమానులు ఆశిస్తున్నారు. భవిష్యత్తులో ఆమెకు మంచి అవకాశాలు వస్తాయా లేదా అన్నది చూడాలి.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి
Viral dance | ఆఫీస్ దీపావళి వేడుకల్లో యువతి డ్యాన్స్.. ఇంటర్నెట్లో ఏకంగా రెండు కోట్ల వ్యూస్.. Video
Watch: శివసేన నేత ఇంట్లో డ్రగ్స్ ఉంచిన పోలీస్ అధికారి.. తర్వాత ఏం జరిగిందంటే?
Viral news | ఆ ఇంట్లో రోజూ నాగుపాముల కలకలం.. ఏడ వెతికినా పాము గుడ్లే..!
Viral News | అనారోగ్యంతో ఉన్న అమ్మకోసం కేంద్ర మాజీ మంత్రి వేణుగానం..!

