న్యూఢిల్లీ: ఆపరేషన్ సిందూర్ సందర్భంగా పదేళ్ల బాలుడు తన వంతుగా సైనికులకు సేవలందించాడు. టీ, స్నాక్స్, పాలు, లస్సీ వంటివి వారికి అందజేశాడు. నాటి నుంచి ప్రశంసలు పొందిన ఆ బాలుడికి బాల పురస్కార్ అవార్డు దక్కింది. (Bal Puraskar) పంజాబ్ ఫిరోజ్‌పూర్ జిల్లాలోని సరిహద్దు ప్రాంతంలో నివసించే శ్రావణ్ సింగ్‌కు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము శుక్రవారం ప్రధాన మంత్రి రాష్ట్రీయ బాల్ పురస్కార్ ప్రదానం చేశారు.
కాగా, బాల పురస్కార్ అవార్డు తనకు రావడం చాలా సంతోషంగా ఉన్నదని శ్రావణ్ సింగ్ తెలిపాడు. తనకు ఈ అవార్డు దక్కుతుందని ఎప్పుడూ ఊహించలేదని చెప్పాడు. ఆపరేషన్ సింధూర్ సందర్భంగా సైనికులకు చేసిన సేవల గురించి వివరించాడు. ‘పాకిస్థాన్‌పై ఆపరేషన్ సిందూర్ ప్రారంభమైనప్పుడు సైనికులు మా గ్రామానికి వచ్చారు. వారికి సేవ చేయాలని నేను అనుకున్నా. నేను రోజూ వారి కోసం పాలు, టీ, మజ్జిగ, ఐస్ తీసుకెళ్లేవాడిని’ అని మీడియాకు తెలిపాడు.
మరోవైపు ఈ ఏడాది ఏప్రిల్‌లో జమ్ముకశ్మీర్‌లోని పహల్గామ్లో పర్యాటకులతో సహా 26 మందిని ఉగ్రవాదులు కాల్చి చంపారు. దీనికి ప్రతీకారంగా మే నెలలో భారత సైన్యం ఆపరేషన్ సిందూర్ చేపట్టింది. పాకిస్థాన్‌లోని ఉగ్రవాదుల శిబిరాలను ధ్వంసం చేసింది. ఇరు దేశాల మధ్య ఉద్రిక్తతలు పెరుగడంతో పాకిస్థాన్ భారీ నష్టాన్ని చవిచూసింది. పాక్ కీలక ఎయిర్‌బేస్‌లు ధ్వంసం కావడంతో కాళ్లబేరానికి దిగి వచ్చింది. చివరకు కాల్పుల విరమణ ఒప్పందం చేసుకున్నది.
#WATCH | Delhi | A ‘Pradhan Mantri Rashtriya Bal Puraskar’ awardee says, “When Operation Sindoor began against Pakistan, soldiers came to our village. I thought I should serve them. I used to take milk, tea, buttermilk, and ice for them daily… I feel great to be awarded. I had… pic.twitter.com/q7Tcfr9ig4
— ANI (@ANI) December 26, 2025
Also Read:
Watch: చనిపోయిన తర్వాత కూడా.. టీచర్ తలపై కాల్చుతూనే ఉన్న దుండగులు