– దిండిగాల దంపతులను సన్మానించిన కేసీఆర్
ఇల్లెందు, మార్చి 11 : బీఆర్ఎస్ పార్టీ ఖమ్మం జిల్లా మాజీ అధ్యక్షుడు దిండిగాల రాజేందర్ తన పెళ్లి రోజును పురస్కరించుకుని కుటుంబ సభ్యులతో కలిసి బుధవారం ఎర్రవెల్లి ఫామ్‌హౌస్‌లో కేసీఆర్‌ను కలిశారు. కేసీఆర్ ఆప్యాయంగా ఆహ్వానించి కుటుంబ సభ్యులందరిని పలకరించి రాజేందర్ దంపతులకు పెళ్లిరోజు శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా రాజేందర్ మాట్లాడుతూ.. తన పెండ్లి రోజు సందర్భంగా కేసీఆర్ ని కలవడం సంతోషంగా ఉందన్నారు. కారణ జన్ముడు, తనకు దైవ సమానులైన తెలంగాణ జాతిపిత, తెలంగాణ తొలి ముఖ్యమంత్రి తనను ఆప్యాయంగా ఆహ్వానించి శుభాకాంక్షలు తెలిపి, ఉద్యమం నాటి విషయాలను గుర్తుచేయడం జన్మలో మర్చిపోలేని విషయమన్నారు. కేసీఆర్‌ను మళ్లి ముఖ్యమంత్రిగా చూసేంత వరకు అవిశ్రాంతంగా పార్టీకి సేవ చేస్తానని రాజేందర్ పేర్కొన్నారు.

కేసీఆర్‌ను కలిసిన దిండిగాల రాజేందర్