వనపర్తి : ఎల్నినో ప్రభావం ఉన్నప్పటికి రేవంత్ రెడ్డి ( Revanth Reddy ) ఉన్నాడనే ధీమాతో ఆంధ్రా ప్రజలు పంటలు వేస్తున్నారని బీఆర్ఎస్ నాయకులు, మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి ( Niranjan Reddy ) ఆరోపించారు. బుధవారం మాజీ ఎమ్మెల్యే లు చిట్టెం రామ్మోహన్ రెడ్డి, ఆల వెంకటేశ్వర్ రెడ్డితో కలిసి జూరాల ప్రాజెక్టును సందర్శించి ఆత్మకూరులో మీడియా సమావేశంలో నిరంజన్ రెడ్డి మాట్లాడారు.
జూరాల ప్రాజెక్టు నుంచి కుడి, ఎడమ ప్రధాన కాలువలకు నీటి విడుదల చేయకపోవడంపై మండి పడ్డారు. ఆంధ్రకు నీళ్లు వదులుతాడని తెలుసు కాబట్టే అక్కడి రైతులు ధైర్యంగా పంటలు వేస్తున్నారని పేర్కొన్నారు. రేవంత్ రెడ్డికి ఆంధ్రా ప్రజల మీద ఉన్న ప్రేమ తెలంగాణ ప్రజల మీద లేదని విమర్శించారు. ఆరోపించారు.