Shikhar Dhawan : భారత మాజీ క్రికెటర్ శిఖర్ ధావన్ (Shikhar Dhawan) రెండో పెళ్లి చేసుకున్నాడు. మొదటి భార్యతో విడాకుల అనంతరం పరిచయమైన సోఫీ షైన్ (Sophie Shine)ని అతడు వివాహమాడాడు. కొన్నాళ్లుగా సోఫీతో చెట్టాపట్టాలేసుకుని తిరుగుతున్న ధావన్ శనివారం సన్నిహితుల సమక్షంలో ఆమె మెడలో మూడు ముళ్లు వేశాడు. కొత్త జంటకు పలువురు క్రికెటర్లు, సెలబ్రిటీలు శుభాకాంక్షలు తెలియజేశారు.
మాజీ ఓపెనర్ శిఖర్ ధావన్ కొత్త జీవితం ఆరంభించాడు. రెండోసారి ప్రేమలో పడిన అతడు.. సోఫీ షైన్‌ను పెళ్లి చేసుకున్నాడు. ఫిబ్రవరి 20 మెహందీ, సంగీత్ వేడుకలు ముగియడంతో.. ఫిబ్రవరి 21 శనివారం ఈ జంట వివాహ బంధంలో అడుగుపెట్టింది. సన్నిహితులు, శ్రేయోభిలాషుల సమక్షంలో సందడిగా, సంబురంగా జరిగిన వీరి పెళ్లి ఫొటోలను భారత క్రికెటర్ యజ్వేంద్ర చాహల్ పంచుకున్నాడు. భారతీయ సంప్రదాయ దుస్తుల్లో తళుక్కుమన్న ఈ కొత్త జంటకు అభినందనలు వెల్లువెత్తుతున్నాయి.
మోడల్‌ను తలపించే అందగత్తె సోఫీ షైన్ సొంత దేశం ఐర్లాండ్. కాస్ట్లేట్రోయ్ కాలేజీలో చదివిన ఈ అందగత్తె ఆ తర్వాత మార్కెటింగ్, మేనేజ్మెంట్లో డిగ్రీ పూర్తి చేసింది. ప్రస్తుతం సోఫియా ప్రొడక్ట్ కన్సల్టంట్గా పని చేస్తోంది. అబుదాబీలోని నార్తర్న్ ట్రస్ట్ కో-ఆపరేషన్ సంస్థ-లో ఉపాధ్యక్షురాలిగా సేవలందిస్తోందీ ముద్దుగుమ్మ. ఈ బ్యూటీకి సోషల్ మీడియాలో లక్ష 34 వేలమంది ఫాలోవర్లు ఉన్నారు. దుబాయ్‌లో ఛాంపియన్స్ ట్రోఫీ జరిగినప్పటి నుంచి జంటగా కనిపించిన ధావన్, సోఫీయాలు ఎట్టకేలకు పెళ్లితో తమ అనుబంధాన్ని శాశ్వతం చేసుకున్నారు.
The vibes from Shikhar Dhawan and Sophie Shine’s sangeet as they show off their dance moves! 💃🕺✨#ShikharDhawan #Delhi #Cricket #Sportskeeda pic.twitter.com/jDnjwrkFwx
— Sportskeeda (@Sportskeeda) February 21, 2026
టీమిండియా గొప్ప ఓపెనర్లలో ఒకడైన ధావన్ వైవాహిత జీవితం మాత్రం ఒడిదొడుకులతో సాగింది. ఆస్ట్రేలియాకు చెందిన అయేషా ముఖర్జీ (Ayesha Mukherjee)ని మనువాడిన అతడు.. ఆమెతో విభేదాల కారణంగా విడిపోయాడు. అయేషాతో 11 ఏళ్ల దాంపత్య జీవితానికి ముగింపు పలుకుతూ గబ్బర్ 2023లో విడాకులు తీసుకున్నాడు. అప్పటి నుంచి ఒంటరిగానే ఉన్న అతడు.. కుమారుడు జొరావర్‌ను ఎంతో మిస్ అవుతున్నాని, రాత్రిళ్లు ఒంటరిగా నిద్ర పట్టడం లేదని పలు సందర్భాల్లో వాపోయాడు. అయితే.. సోఫీ షైన్ రాకతో తన జీవితంలో మళ్లీ సంతోషం నిండిందని ఒక ఇంటర్వ్యూలో చెప్పాడీ మాజీ ఓపెనర్.