న్యూఢిల్లీ: ఒక లిఫ్ట్‌లో ఇద్దరు చిన్నారులు ఉన్నారు. ఇంతలో డోర్ మూసుకోబోయింది. అప్రమత్తమైన బాలిక తన కాలు, చేతులను అడ్డుగా ఉంచింది. లిఫ్ట్ డోర్ క్లోజ్ కాకుండా ప్రయత్నించింది. గమనించిన కొంతమంది మహిళలు సహాయం కోసం ముందుకు వచ్చారు. (Girl Block Closing Lift Doors To Rescue) ఈ వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. ఒక లిఫ్ట్‌లో ఇద్దరు చిన్నారులు ఉన్నారు. ఒక బాలిక లిఫ్ట్ డోర్ వద్ద ఉన్నది. డోర్ క్లోజ్ కాకుండా అడ్డుగా ఆమె ఉన్నది.
కాగా, ఉన్నట్టుండి ఆ లిఫ్ట్ డోర్ సెన్సార్లు పని చేయలేదు. దీంతో లిఫ్ట్ డోర్ క్లోజ్ అవుతుండగా ఆ బాలిక వెంటనే అప్రమత్తమైంది. తన కాలు, చేతులను అడ్డుగా ఉంచింది. ఇంతలో కొందరు మహిళలు ఆ లిఫ్ట్ వద్దకు చేరుకున్నారు. క్లోజ్ అవుతున్న లిఫ్ట్ డోర్‌ను లాగి పట్టుకున్నారు. లిఫ్ట్ లోపల ఉన్న ఇద్దరు చిన్నారులను ఆ బాలిక బయటకు తెచ్చింది. ఆమె కూడా బయటకు రాగానే ఆ లిఫ్ట్ డోర్ మూసుకున్నది. ఆ బాలిక చొరవతో చిన్నారులకు ప్రమాదం తప్పింది. అయితే ఈ సంఘటన ఎక్కడ జరిగింది అన్నది తెలియలేదు.
మరోవైపు ఆ లిఫ్ట్‌లోని సీసీటీవీలో రికార్డైన ఈ వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. దీంతో నెటిజన్లు భిన్నంగా స్పందించారు. ఆ బాలిక అలెర్ట్నెస్, ధైర్యాన్ని కొందరు ప్రశంసించారు. లిఫ్ట్ భద్రత, నిర్వహణపై మరికొందరు ఆందోళన వ్యక్తం చేశారు. పెద్దలు లేకుండా పిల్లలు ఆ లిఫ్ట్‌ను వినియోగించడంపై మరికొందరు మండిపడ్డారు. పిల్లల భద్రత పట్ల అజాగ్రత్తగా వహించిన వారి తల్లిదండ్రులపై ఆగ్రహం వ్యక్తం చేశారు.
A small girl is seen at the entrance of a residential lift.
As the elevator doors began to close, she noticed
another child running toward the lift from the corridor.Without hesitation, the girl used her own body to partially block the doorway, preventing the heavy doors from… pic.twitter.com/llUbPdk5eN
— SUNIL KUMAR (@ijustsunil) February 21, 2026
Also Read:
Kashmiri Pandits | దాడుల బెదిరింపు పోస్టర్లపై ఆందోళన.. భద్రత కోరిన కశ్మీరీ పండిట్లు
School Teachers Arrested For Rape | విద్యార్థినిపై అత్యాచారం.. ఐదుగురు టీచర్లు అరెస్ట్
Bride Kidnapped At Gunpoint | నవ వరుడిని గన్‌తో బెదిరించి.. నవ వధువును కిడ్నాప్ చేసిన మాజీ ప్రియుడు