భువనేశ్వర్: పెళ్లి తర్వాత భర్తతో కలిసి ఇంటికి వెళ్తున్న నవ వధువును ఆమె మాజీ ప్రియుడు అడ్డుకున్నాడు. నవ వరుడ్ని గన్‌తో బెదిరించాడు. కొత్త పెళ్లికూతురిని కిడ్నాప్ చేసి పారిపోయాడు. షాకైన కొత్త పెళ్లికొడుకు పోలీసులకు ఫిర్యాదు చేశాడు. (Bride Kidnapped At Gunpoint) ఒడిశాలోని బోలంగీర్ జిల్లాలో ఈ సంఘటన జరిగింది. ఆ జిల్లాకు చెందిన హరిబంధు పటేల్‌కు శనివారం రాత్రి కాంటమల్లో ఒక మహిళతో పెళ్లి జరిగింది.
కాగా, పెళ్లి తర్వాత నవ వధువు, తన కుటుంబ సభ్యులతో కలిసి నవ వరుడు హరిబంధు పటేల్ వాహనంలో తన ఊరికి తిరుగుప్రయాణమయ్యాడు. ఆదివారం తెల్లవారుజామున తర్భా రోడ్డులోని బదబంధ సమీపంలో కొత్త పెళ్లికూతురు మాజీ ప్రియుడు మరో ఇద్దరితో కలిసి వారి వాహనాన్ని అడ్డుకున్నాడు. నవ వరుడికి గన్ గురిపెట్టి బెదిరించారు. నవ వధువును కిడ్నాప్ చేసి అక్కడి నుంచి పారిపోయాడు.
మరోవైపు కొత్త పెళ్లికొడుకు హరిబంధు పటేల్, అతడి కుటుంబం ఈ సంఘటనకు షాక్ అయ్యింది. అనంతరం తర్భా పోలీస్ స్టేషన్లో హరిబంధు ఫిర్యాదు చేశాడు. నూతన భార్య మాజీ ప్రియుడు తనను గన్‌తో బెదిరించి ఆమెను కిడ్నాప్ చేసినట్లు ఆరోపించాడు. దీంతో పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఆ మహిళను రక్షించేందుకు ప్రయత్నిస్తున్నట్లు పోలీస్ అధికారి వెల్లడించారు.
Also Read:
Two cops shot dead | పోలీస్ అవుట్‌పోస్ట్‌లో ఇద్దరు పోలీసులు.. కాల్పుల గాయాలతో మృతి
IIT Bombay | ఐఐటీ బాంబే హాస్టల్ రూమ్‌లో 5 బుల్లెట్లు.. పోలీసుల అదుపులో బీహార్ వ్యక్తి