అహ్మదాబాద్: ఇరాన్ బోటును భారత కోస్ట్ గార్డ్ అడ్డుకున్నది. రూ.5 కోట్ల విలువైన విదేశీ సిగరెట్లను స్వాధీనం చేసుకున్నది. ఆ బోటులో ఉన్న నలుగురు ఇరాన్ పౌరులను అదుపులోకి తీసుకున్నది. (Coast Guard Intercepts Iranian Boat) గుజరాత్ తీరంలోని అరేబియా సముద్రంలో ఈ సంఘటన జరిగింది. ఫిబ్రవరి 21న ద్వారకాకు పశ్చిమాన సుమారు 115 నాటికల్ మైళ్ల దూరంలో అనుమానాస్పద విదేశీ పడవను భారత కోస్ట్ గార్డ్ సిబ్బంది గుర్తించారు. షిప్లో ఆ బోటు వద్దకు చేరుకున్నారు.
కాగా, భారత సముద్ర జలాల్లో ఉన్న ఆ బోటు ఇరాన్‌కు చెందినట్లు భారత కోస్ట్ గార్డ్ సిబ్బంది తెలుసుకున్నారు. ఆ బోటులో 200 కార్టన్ల విదేశీ బ్రాండ్ సిగరెట్లు ఉన్నట్లు గుర్తించారు. రూ.5 కోట్ల విలువైన సుమారు లక్ష ప్యాకెట్ల విదేశీ బ్రాండ్ సిగరెట్లను స్వాధీనం చేసుకున్నారు.
మరోవైపు ఆ బోటులో ఉన్న నలుగురు ఇరానియన్ సిబ్బందిని అదుపులోకి తీసుకున్నట్లు భారత కోస్ట్ గార్డ్ తెలిపింది. అల్ ముఖ్తార్గా గుర్తించిన ఇరాన్ పడవ, అందులో ఉన్న నలుగురు సిబ్బందిని గుజరాత్‌లోని పోర్బందర్కు తరలించినట్లు వెల్లడించింది. రూ.5 కోట్ల విలువైన విదేశీ బ్రాండ్ సిగరెట్ల అక్రమ రవాణాపై దర్యాప్తు చేస్తున్నట్లు పేర్కొంది.
On 21 Feb 26, @IndiaCoastGuard ship intercepted a suspicious foreign boat inside the #Indian #EEZ, approximately 115 NM west of #Dwarka. The vessel, identified as Al Mukhtar, was manned by four #Iranian crew. On rummaging, 200 cartons containing about one lakh packets of foreign… pic.twitter.com/ogALfIKFIp
— Indian Coast Guard (@IndiaCoastGuard) February 22, 2026
Also Read:
IIT Bombay | ఐఐటీ బాంబే హాస్టల్ రూమ్‌లో 5 బుల్లెట్లు.. పోలీసుల అదుపులో బీహార్ వ్యక్తి
Watch: పరీక్షలో కాపీని అడ్డుకున్న ప్రొఫెసర్.. వైద్య విద్యార్థి దాడి, వీడియో వైరల్
Watch: సిగరెట్ కాల్చవద్దన్నందుకు.. బైక్ పెట్రోల్ ట్యాంకులోకి లైటర్ విసిరిన వ్యక్తి