చండీగఢ్: పోలీస్ అవుట్‌పోస్ట్‌లో రాత్రి విధుల్లో ఉన్న ఇద్దరు పోలీసులు అనుమానాస్పదంగా మరణించారు. కాల్పుల గాయాలతో వారు చనిపోయారు. భారత్, పాకిస్థాన్ అంతర్జాతీయ సరిహద్దు సమీపంలో ఇది జరుగడం కలకలం రేపింది. (Two cops shot dead) పంజాబ్‌లోని గురుదాస్‌పూర్ జిల్లాలో ఈ సంఘటన జరిగింది. శనివారం రాత్రి సరిహద్దులోని డోరాంగ్లా అవుట్‌పోస్ట్‌లో అసిస్టెంట్ సబ్-ఇన్స్పెక్టర్, స్టేషన్ హౌస్ ఆఫీసర్ (ఎస్‌హెచ్‌వో) గుర్నామ్ సింగ్, హోమ్ గార్డ్ అశోక్ కుమార్ విధుల్లో ఉన్నారు. ఆదివారం తెల్లవారుజామున అవుట్‌పోస్ట్‌లోని ఒక గదిలో వారిద్దరూ కాల్పుల గాయాలతో మరణించినట్లు పోలీసులు తెలుసుకున్నారు.
కాగా, సరిహద్దు భద్రతా దళం డీఐజీ, గురుదాస్‌పూర్ ఎస్ఎస్పీ, పోలీస్ ఉన్నతాధికారులు సంఘటనా స్థలానికి చేరుకున్నారు. గ్యాంగ్స్టర్లు లేదా ఉగ్రవాదుల ప్రమేయంపై అనుమానం వ్యక్తం చేశారు. సరిహద్దు ప్రాంతాల్లోని భద్రతా సిబ్బందిని అప్రమ్తం చేశారు.
మరోవైపు వివాదం నేపథ్యంలో ఆ ఇద్దరు పోలీసులు ఒకరినొకరు కాల్చుకుని ఉండవచ్చన్న కోణంలో కూడా దర్యాప్తు చేస్తున్నట్లు పోలీస్ అధికారులు తెలిపారు. ఫోరెన్సిక్, సాంకేతిక బృందాలతో ఆధారాలు సేకరించినట్లు వెల్లడించారు.
Also Read:
IIT Bombay | ఐఐటీ బాంబే హాస్టల్ రూమ్‌లో 5 బుల్లెట్లు.. పోలీసుల అదుపులో బీహార్ వ్యక్తి
Watch: సిగరెట్ కాల్చవద్దన్నందుకు.. బైక్ పెట్రోల్ ట్యాంకులోకి లైటర్ విసిరిన వ్యక్తి