Ramayana | ‘రామాయణ’లో శూర్పణఖగా రకుల్ ప్రీత్ సింగ్.. ఈ పాత్రనే ఎందుకు ఎంచుకుందో వివరణ
Ramayana | నితీష్ తివారీ దర్శకత్వంలో అత్యంత ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతున్న పాన్ ఇండియా చిత్రం రామాయణం పై ప్రేక్షకుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. భారతీయ ఇతిహాసాన్ని అత్యాధునిక సాంకేతికతతో తెరకెక్కిస్తున్న ఈ చిత్రంలో పలువురు స్టార్ నటీనటులు కీలక పాత్రలు పోషిస్తున్నారు.
Ramayana | నితీష్ తివారీ దర్శకత్వంలో అత్యంత ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతున్న పాన్ ఇండియా చిత్రం రామాయణం పై ప్రేక్షకుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. భారతీయ ఇతిహాసాన్ని అత్యాధునిక సాంకేతికతతో తెరకెక్కిస్తున్న ఈ చిత్రంలో పలువురు స్టార్ నటీనటులు కీలక పాత్రలు పోషిస్తున్నారు. ముఖ్యంగా శూర్పణఖ పాత్రలో నటిస్తున్న రకుల్ ప్రీత్ సింగ్ లుక్ ఇటీవల విడుదలైన ప్రచార చిత్రాలతో సోషల్ మీడియాలో వైరల్గా మారింది. ట్రైలర్లో రకుల్ కనిపించిన తీరు, ఆమె ప్రత్యేకమైన గెటప్, ఆభరణాలు, కాస్ట్యూమ్స్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి. ఇప్పటివరకు తెరపై కనిపించిన శూర్పణఖ పాత్రలకు భిన్నంగా ఈ పాత్రను అత్యంత గ్రాండ్గా డిజైన్ చేసినట్లు అభిమానులు అభిప్రాయపడుతున్నారు. పాత్రలోని గంభీరత, రాజసాన్ని ప్రతిబింబించేలా రూపొందించిన లుక్కు నెటిజన్ల నుంచి ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి.
సీత పాత్రలో నటిస్తున్న సాయిపల్లవితో పాటు రకుల్ ప్రీత్ సింగ్ లుక్ కూడా సినిమాపై ఆసక్తిని మరింత పెంచిందని సినీ అభిమానులు సోషల్ మీడియాలో కామెంట్లు చేస్తున్నారు. శూర్పణఖ పాత్రను కేవలం ప్రతినాయకురాలిగా కాకుండా, ఆమె వ్యక్తిత్వంలోని విభిన్న కోణాలను చూపించే ప్రయత్నం ఈ చిత్రంలో జరిగిందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఇటీవల సోషల్ మీడియాలో ఓ అభిమాని “ఈ పాత్రను ఎందుకు అంగీకరించారు?” అని ప్రశ్నించగా రకుల్ ఆసక్తికరంగా స్పందించారు. శూర్పణఖ పాత్రలో ఉన్న సంక్లిష్టత నన్ను ఎంతో ఆకట్టుకుంది. రామాయణంలో ఆమె గురించి చాలామందికి ఒకే ఒక్క ఘట్టమే గుర్తుంటుంది. కానీ ఆ పాత్ర వెనుక ఎన్నో భావోద్వేగాలు, తెలియని కోణాలు ఉన్నాయి. ఒక నటిగా సవాళ్లతో కూడిన పాత్రలు చేయాలని ఎప్పుడూ కోరుకుంటాను. అందుకే ఈ పాత్రను అంగీకరించాను. ప్రేక్షకులు థియేటర్లో ఈ పాత్రను కొత్త దృక్కోణంలో చూస్తారని ఆశిస్తున్నాను అని రకుల్ తెలిపారు.
ఒకప్పుడు టాలీవుడ్లో స్టార్ హీరోయిన్గా వరుస విజయాలు అందుకున్న రకుల్ ప్రీత్ సింగ్, ‘వెంకటాద్రి ఎక్స్ప్రెస్’, ‘లౌక్యం’, ‘సరైనోడు’, ‘ధృవ’, ‘స్పైడర్’, ‘కొండపొలం’ వంటి చిత్రాలతో ప్రత్యేక గుర్తింపు సంపాదించారు. అనంతరం బాలీవుడ్లోనూ వరుస అవకాశాలు అందిపుచ్చుకుని తన కెరీర్ను విజయవంతంగా కొనసాగిస్తున్నారు. ఇప్పుడు ‘రామాయణం’లో శూర్పణఖ పాత్రతో మరోసారి ప్రేక్షకుల ముందుకు రానున్న రకుల్ ప్రీత్ సింగ్, తన నటనతో కొత్త ముద్ర వేయాలని భావిస్తున్నారు. ఈ చిత్రంలో ఆమె పాత్ర ఎలా ఉండబోతోందో తెలుసుకోవాలనే ఆసక్తి ప్రేక్షకుల్లో రోజురోజుకూ పెరుగుతోంది.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
V Hanumantha Rao | నేను మాట్లాడొద్దా.. స్పీచ్ మధ్యలో సీఎం రేవంత్ రెడ్డిని అడ్డుకున్న వీ హన్మంతరావు.. వీడియో
Farmers Protest | వ్యవసాయానికి నిరంతరంగా విద్యుత్ సరఫరా చేయాలని రైతుల మహాధర్నా
Rahul Gandhi | జ్ఞానేష్ కుమార్కు వ్యతిరేకంగా రాహుల్, ప్రతిపక్షాల పిటిషన్.. రిజిష్టర్ చేసిన సుప్రీంకోర్టు
తుమ్మడంలో స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీ
Bulldozers: డ్రగ్స్ వ్యతిరేక ఉద్యమకారుడి కాల్చివేత.. బుల్డోజర్లతో నిందితుడి ఇళ్లు కూల్చివేత
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్పై ప్రభావం ఉంటుందా..?

