Dragon | మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్, స్టార్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ కాంబినేషన్లో తెరకెక్కుతున్న భారీ పాన్ ఇండియా యాక్షన్ ఎంటర్టైనర్ ‘డ్రాగన్’ పై అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. ‘కేజీఎఫ్’, ‘సలార్’ చిత్రాల తర్వాత ప్రశాంత్ నీల్ రూపొందిస్తున్న ఈ సినిమా ప్రారంభం నుంచే దేశవ్యాప్తంగా హాట్ టాపిక్‌గా మారింది. ఇటీవల విడుదలైన స్పెషల్ టీజర్ సినిమాపై అంచనాలను మరింత పెంచగా, ఇప్పుడు షూటింగ్‌కు సంబంధించిన తాజా అప్డేట్ అభిమానుల్లో కొత్త ఉత్సాహాన్ని నింపుతోంది. అయితే ఇటీవల ఓ యాక్షన్ సీక్వెన్స్ చిత్రీకరణ సమయంలో ఎన్టీఆర్ భుజానికి స్వల్ప గాయం అయినట్లు వార్తలు వెలువడ్డాయి. వైద్యుల సూచన మేరకు ఆయన కొద్ది రోజులుగా విశ్రాంతి తీసుకుంటున్నారు. దీంతో ‘డ్రాగన్’ షూటింగ్ పూర్తిగా నిలిచిపోయిందని, సినిమా విడుదల కూడా వాయిదా పడే అవకాశముందని సోషల్ మీడియాలో ప్రచారం జరిగింది. అయితే ఈ ప్రచారంలో ఎలాంటి నిజం లేదని చిత్ర వర్గాలు స్పష్టం చేస్తున్నాయి.
ఎన్టీఆర్ విశ్రాంతి తీసుకుంటున్నప్పటికీ, షూటింగ్‌ను ఆపకుండా ప్రశాంత్ నీల్ తన ప్లానింగ్ ప్రకారం ముందుకు తీసుకెళ్తున్నారని సమాచారం. ప్రస్తుతం తారక్ అవసరం లేని కీలక సన్నివేశాలు, ఇతర నటీనటుల కాంబినేషన్లోని టాకీ పార్ట్‌ను శరవేగంగా పూర్తి చేస్తున్నట్లు తెలుస్తోంది. షూటింగ్ షెడ్యూల్‌కు ఎలాంటి అంతరాయం కలగకుండా చిత్ర బృందం ముందస్తు ప్రణాళికతో పనిచేస్తోందని ఇండస్ట్రీ వర్గాలు చెబుతున్నాయి. మరోవైపు ఎన్టీఆర్ కూడా వేగంగా కోలుకుంటున్నారని, వైద్యుల అనుమతి లభించిన వెంటనే తిరిగి షూటింగ్లో పాల్గొంటారని సమాచారం. దీంతో సినిమా విడుదల తేదీపై వస్తున్న ఊహాగానాలకు కూడా తెరపడినట్లైంది. మేకర్స్ అనుకున్న షెడ్యూల్ ప్రకారమే చిత్రీకరణ పూర్తి చేసి, ముందుగా ప్రకటించిన తేదీకే సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలని లక్ష్యంగా పెట్టుకున్నారు.
ఈ చిత్రంలో ఎన్టీఆర్ సరసన కన్నడ నటి రుక్మిణి వసంత్ కథానాయికగా నటిస్తుండగా, బాలీవుడ్ సీనియర్ నటులు అనిల్ కపూర్, అశుతోష్ రాణా కీలక పాత్రలు పోషిస్తున్నారు. ప్రశాంత్ నీల్ ఆస్థాన సంగీత దర్శకుడు రవి బస్రూర్ సంగీతం అందిస్తున్న ఈ చిత్రాన్ని మైత్రీ మూవీ మేకర్స్, ఎన్టీఆర్ ఆర్ట్స్ సంయుక్తంగా భారీ స్థాయిలో నిర్మిస్తున్నాయి. భారీ యాక్షన్, పవర్ఫుల్ ఎమోషన్స్, ప్రశాంత్ నీల్ స్టైల్ మాస్ ఎలివేషన్స్‌తో రూపొందుతున్న ‘డ్రాగన్’ వచ్చే ఏడాది జూన్ 11న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్‌గా విడుదల కానుంది. ఎన్టీఆర్–ప్రశాంత్ నీల్ కాంబినేషన్ బాక్సాఫీస్ వద్ద ఎలాంటి సంచలనం సృష్టిస్తుందో చూడాలని అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.