Johnny Master | జానీ మాస్టర్‌కు కొత్త చిక్కులు.. ఫిల్మ్ ఫెడరేషన్తో విభేదాలు ముదిరాయా?
Johnny Master | టాలీవుడ్ ప్రముఖ కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ మరోసారి వార్తల్లో నిలిచారు. ఈసారి ఆయన సినిమాల కంటే ఫిల్మ్ ఫెడరేషన్తో నెలకొన్న విభేదాల కారణంగా ఇండస్ట్రీలో హాట్ టాపిక్‌గా మారారు. డ్యాన్సర్స్ అసోసియేషన్ వ్యవహారంలో తీసుకున్న నిర్ణయాలు, ఫెడరేషన్ సూచనలను పట్టించుకోవడం లేదనే ఆరోపణల నేపథ్యంలో ఆయనపై క్రమశిక్షణ చర్యలు తీసుకునే అవకాశాలపై సినీ వర్గాల్లో చర్చ సాగుతోంది.
Johnny Master | టాలీవుడ్ ప్రముఖ కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ మరోసారి వార్తల్లో నిలిచారు. ఈసారి ఆయన సినిమాల కంటే ఫిల్మ్ ఫెడరేషన్తో నెలకొన్న విభేదాల కారణంగా ఇండస్ట్రీలో హాట్ టాపిక్‌గా మారారు. డ్యాన్సర్స్ అసోసియేషన్ వ్యవహారంలో తీసుకున్న నిర్ణయాలు, ఫెడరేషన్ సూచనలను పట్టించుకోవడం లేదనే ఆరోపణల నేపథ్యంలో ఆయనపై క్రమశిక్షణ చర్యలు తీసుకునే అవకాశాలపై సినీ వర్గాల్లో చర్చ సాగుతోంది. డ్యాన్సర్స్ అసోసియేషన్ ఎన్నికల అంశం వివాదానికి కేంద్రబిందువైంది. ఉప ఎన్నికలు నిర్వహించాలని జానీ మాస్టర్ వర్గం నిర్ణయించగా, దీనికి ఫిల్మ్ ఫెడరేషన్ అభ్యంతరం వ్యక్తం చేసినట్లు సమాచారం. ఫెడరేషన్ నిర్ణయాలను పక్కనబెట్టి ముందుకు వెళ్తున్నారనే ఆరోపణలు రావడంతో ఇరు వర్గాల మధ్య విభేదాలు మరింత ముదిరినట్లు తెలుస్తోంది.
ఇదే సమయంలో జానీ మాస్టర్ భార్య, డ్యాన్సర్స్ అసోసియేషన్ అధ్యక్షురాలు సుమలత వ్యవహార శైలిపైనా విమర్శలు వ్యక్తమవుతున్నాయి. అసోసియేషన్‌లో ఏకపక్ష నిర్ణయాలు తీసుకుంటున్నారనే ఆరోపణలతో పలువురు సభ్యులు రాజీనామా చేయడం పరిస్థితిని మరింత ఉద్రిక్తం చేసింది. ఈ వివాదం ముదరడంతో ఫిల్మ్ ఫెడరేషన్ రంగంలోకి దిగి ఇరు వర్గాల మధ్య రాజీ కుదిర్చేందుకు ప్రయత్నించినట్లు తెలుస్తోంది. అయితే సమస్య పరిష్కారమైందని ప్రకటించిన కొద్ది రోజులకే వివాదం మళ్లీ తెరపైకి వచ్చింది. ఫెడరేషన్ నిర్ణయాలు తమ కార్యకలాపాలకు ఆటంకం కలిగిస్తున్నాయని జానీ మాస్టర్ నిర్మాతలకు వినతిపత్రం అందజేసినట్లు వార్తలు రావడంతో పరిస్థితి మళ్లీ వేడెక్కింది. దీంతో ఈ వ్యవహారం మరోసారి ఇండస్ట్రీలో చర్చనీయాంశంగా మారింది.
ప్రస్తుతం జానీ మాస్టర్‌పై క్రమశిక్షణ చర్యలు తీసుకోవాలా లేదా అనే అంశంపై ఫిల్మ్ ఫెడరేషన్ అంతర్గతంగా చర్చలు జరుగుతున్నాయనే ప్రచారం సాగుతోంది. అయితే దీనిపై ఇప్పటివరకు ఫెడరేషన్ నుంచి ఎలాంటి అధికారిక ప్రకటన వెలువడలేదు. శాశ్వత నిషేధం విధించే అవకాశముందంటూ సోషల్ మీడియాలో వార్తలు ప్రచారంలో ఉన్నప్పటికీ, వాటిని ధృవీకరించే అధికారిక సమాచారం మాత్రం లేదు. డ్యాన్సర్స్ అసోసియేషన్‌లో తరచూ తలెత్తుతున్న వివాదాలకు జానీ మాస్టర్ వ్యవహార శైలే కారణమన్న అభిప్రాయాలు కూడా సినీ వర్గాల్లో వినిపిస్తున్నాయి. మరోవైపు ఆయన అభిమానులు మాత్రం పూర్తి వివరాలు బయటకు రాకముందే ఊహాగానాలు చేయడం సరికాదని అభిప్రాయపడుతున్నారు. ఈ వివాదంపై ఫిల్మ్ ఫెడరేషన్ లేదా జానీ మాస్టర్ నుంచి అధికారిక స్పందన వస్తేనే అసలు పరిస్థితిపై స్పష్టత వచ్చే అవకాశం ఉంది.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Harish Rao | జర్మనీలో ఉద్యోగాల పేరుతో మోసం.. రేవంత్ సర్కార్‌పై హరీశ్‌రావు ఫైర్
Hyderabad | తాగునీరు వృథా చేస్తే ఊరుకోం.. జూబ్లీహిల్స్ పబ్‌కు రూ.20 వేల జరిమానా!
AP News | ఏపీ మున్సిపల్ ఎన్నికలు.. ముగిసిన నామినేషన్ల గడువు
Mental Health Problems | మానసిక సమస్యలకు చికిత్స అంటే కేవలం మందులు వాడడమే కాదు.. ఇలా కూడా చేయాలి..
Gurrala Nagaraju | ఏం రాసినా చెల్లుతది..ఎట్లా రాసినా జనం నమ్ముతరు అనుకుంటే పొరపాటే : గుర్రాల నాగరాజు
ట్రెండింగ్ వార్తలు
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!

