న్యూఢిల్లీ: ఒక ఇంట్లో అగ్నిప్రమాదం సంభవించింది. ఫైర్ సిబ్బంది, పోలీసులు అక్కడకు చేరుకున్నారు. మంటలు ఆర్పుతుండగా గ్యాస్ సిలిండర్ పేలింది. ఈ నేపథ్యంలో ఫైర్ సిబ్బంది, పోలీసులతో సహా 13 మందికి కాలిన గాయాలయ్యాయి. (LPG Cylinder Explodes) వారిని ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. దేశ రాజధాని ఢిల్లీలోని మజ్లిస్ పార్క్ ప్రాంతంలో ఈ సంఘటన జరిగింది. ఆదివార ఉదయం 9 గంటల సమయంలో ఆదర్శ్‌నగర్‌లోని ఒక ఇంట్లో అగ్నిప్రమాదం జరిగింది. ఈ సమాచారం తెలుసుకున్న ఫైర్ సిబ్బంది, స్థానిక పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకున్నారు.
కాగా, ఫైర్ సిబ్బంది మంటలు ఆర్పుతుండగా గ్యాస్ సిలిండర్ పేలింది. దీంతో మంటలు ఆర్పుతున్న వారిలో ఐదుగురు ఫైర్ సిబ్బంది, అక్కడ ఉన్న ఆరుగురు పోలీసులు గాయపడ్డారు. వారిలో కొందరికి తీవ్రంగా కాలిన గాయాలయ్యాయి.
మరోవైపు గాయపడిన వారిని తొలుత చికిత్స కోసం బాబు జగ్జీవన్ రామ్ మెమోరియల్ ఆసుపత్రికి తరలించారు. ఆ తర్వాత మెరుగైన వైద్య చికిత్స కోసం సఫ్దర్‌జంగ్ ఆసుపత్రికి తరలించినట్లు పోలీస్ అధికారి తెలిపారు. అగ్నిప్రమాదం కారణంపై దర్యాప్తు చేస్తున్నట్లు ఫైర్ ఆఫీసర్ వెల్లడించారు.
Also Read:
Bride Kidnapped At Gunpoint | నవ వరుడిని గన్‌తో బెదిరించి.. నవ వధువును కిడ్నాప్ చేసిన మాజీ ప్రియుడు
Two cops shot dead | పోలీస్ అవుట్‌పోస్ట్‌లో ఇద్దరు పోలీసులు.. కాల్పుల గాయాలతో మృతి
IIT Bombay | ఐఐటీ బాంబే హాస్టల్ రూమ్‌లో 5 బుల్లెట్లు.. పోలీసుల అదుపులో బీహార్ వ్యక్తి