ప్రతి ఏడాది ఆనవాయితీ ప్రకారం నిర్వహించే అభిమానుల భేటీలో అగ్ర హీరో అల్లు అర్జున్ ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. ట్రోల్స్ గురించి, అభిమానుల మధ్య ఫ్యాన్‌వార్స్ గురించి ఆయన తన అభిప్రాయాల్ని వెల్లడించారు. మనకు నచ్చని వాళ్లని వదిలేయాలని, వారి కోసం ఏమాత్రం సమయాన్ని వృథా చేసుకోవద్దని సూచించారు. ‘నా అభిమానులతో పాటు నన్ను ద్వేషించే ట్రోలర్స్‌కి కూడా ఈ విషయం ఎప్పటి నుంచో చెబుదామనుకుంటున్నా. ప్రతీ రోజు మనలో ఉండే వంద శాతం ఎనర్జీని ఎందుకోసం వాడుకుంటామనేది చాలా ముఖ్యం.
ఎవరైనా నచ్చకపోతే వారిని ద్వేషిస్తూ, ట్రోల్ చేస్తూ సమయాన్ని వృథా చేసుకోవద్దు. మనకు నచ్చని వారి కోసం డబ్బులు ఖర్చు పెడతామా? అలాగే నచ్చని విషయాల కోసం మన టైమ్, ఎనర్జీని అస్సలు ఖర్చు పెట్టొద్దు. ఆ సమయాన్ని మన అభివృద్ధి కోసం వినియోగించుకోవాలి. నచ్చిన పనిచేస్తూ ముందుకువెళ్లాలి. నీకు నచ్చిన అమ్మాయి ఇంటి ముందు నిలబడు. కనీసం ఆ కాస్త సమయాన్నైనా నువ్వు ఎంజాయ్ చేస్తావు’ అని అల్లు అర్జున్ అన్నారు. ఈ వీడియో సోషల్‌మీడియాలో వైరల్‌గా మారింది. ప్రస్తుతం అల్లు అర్జున్ ‘రాకా’ చిత్రంలో నటిస్తున్న విషయం తెలిసిందే. అట్లీ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా చిత్రీకరణ జరుగుతున్నది.