బెంగళూరు, సెప్టెంబర్ 16: నిబంధనలకు విరుద్ధంగా వైద్య అధికారిణిగా పనిచేస్తున్న కర్ణాటక కాంగ్రెస్ ఎమ్మెల్యే మేనకోడలును అధికారులు విధుల నుంచి తప్పించారు. కాంగ్రెస్ ఎమ్మెల్యే ఉమేశ్ మేతి మేనకోడలు అంకిత యరగల్ బాగల్కోట్లో ప్రభుత్వ నమ్మల్ క్లినిక్‌లో కొన్ని నెలల నుంచి మెడికల్ ఆఫీసర్‌గా పనిచేస్తూ రూ.70 వేలకు పైగా జీతాన్ని పొందుతున్నారు. ఈ ఏడాది మార్చి నుంచి అమె విధులకు గైర్హా జర్ కావడంతో, విచారించగా, ఆమె ఒక ప్రైవేట్ వైద్య కళాశాలలో పీజీ విద్య అభ్యసిస్తున్నట్టు తెలిసింది. ప్రభుత్వ దవాఖాన నుంచి జీతం తీసుకుంటూ వేరేచోట చదవడం నిబంధనలకు విరుద్ధం కావడంతో ఆమెకు నోటీస్ జారీ చేసి బుధవారం విచారణకు హాజరు కావాలని ఆదేశించారు. అయితే ఆమె హాజరుకాలేదు. దీంతో ఆమె ను వైద్యాధికారిగా విధుల నుంచి తొలగిస్తూ జిల్లా ఆరోగ్య అధికారి ఉత్తర్వులు జారీ చేశారు.