Cop Cancels Wedding | డిమాండ్ చేసిన కారు కనిపించకపోవడంతో.. పెళ్లి రద్దు చేసిన పోలీస్ అధికారి
Cop Cancels Wedding | ఒక పోలీస్ అధికారికి పెళ్లి సంబంధం కుదిరింది. అయితే కట్నకానుకలుగా రూ.13 లక్షల విలువైన ‘మారుతి బ్రెజ్జా’ కారు కావాలని డిమాండ్ చేశాడు. పెళ్లి మండపం వద్ద ఆ కొత్త కారు కనిపించకపోవడంతో వధువు కుటుంబ సభ్యులతో గొడవ పడి పెళ్లిని రద్దు చేశాడు.
న్యూఢిల్లీ: ఒక పోలీస్ అధికారికి పెళ్లి సంబంధం కుదిరింది. అయితే కట్నకానుకలుగా రూ.13 లక్షల విలువైన ‘మారుతి బ్రెజ్జా’ కారు కావాలని డిమాండ్ చేశాడు. పెళ్లి మండపం వద్ద ఆ కొత్త కారు కనిపించకపోవడంతో వధువు కుటుంబ సభ్యులతో గొడవ పడి పెళ్లి రద్దు చేశాడు. (Cop Cancels Wedding) దీంతో వారు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఢిల్లీ పోలీస్ విభాగంలో పోలీస్ అధికారిగా కుల్దీప్ పనిచేస్తున్నాడు. హర్యానాలోని సోనిపట్‌కు చెందిన సుభాష్ కుమార్తె హీనాతో ఆరు నెలల కిందట ఆయన వివాహం నిశ్చయమైంది. నవంబర్ 20న వీరిద్దరికి పెళ్లి జరుగాల్సి ఉన్నది.
కాగా, పెళ్లి సంబంధం ఖరారైనప్పటి నుంచి కారు, బంగారు నగలు కావాలని వరుడి కుటుంబం డిమాండ్ చేసినట్లు వధువు తండ్రి సుభాష్ ఆరోపించారు. వరుడి కోసం రూ. 9.5 లక్షల విలువైన కారును బుక్ చేసినట్లు చెప్పారు. అయితే వివాహానికి ఒక రోజు ముందు కుల్దీప్కు ఆ కారు నచ్చలేదని, దానికి బదులుగా ‘మారుతి బ్రెజా’ కావాలని మధ్యవర్తుల ద్వారా తెలిసిందన్నారు. దీంతో ముందుగా బుక్ చేసిన కారును రద్దు చేసి, బ్రెజా కారు బుకింగ్ కోసం ప్రయత్నించినా నిర్ణీత సమయానికి ఏర్పాటు చేయడం సాధ్యం కాలేదని ఆయన వివరించారు.
మరోవైపు వరుడి కోసం రెండు తులాల బంగారు గొలుసు, అతడి తల్లి కోసం నాలుగు తులాల బంగారు చెవిపోగులు, వెండి పట్టీలు ఇచ్చేందుకు తమ కుటుంబం అంగీకరించిందని సుభాష్ తెలిపారు. అయితే వరుడి అన్నయ్య, వదినకు కూడా ఆభరణాలు కావాలని డిమాండ్ చేయడంతో వాటి కోసం కూడా ఆర్డర్లు ఇచ్చినట్లు చెప్పారు. వీటితో పాటు రూ.1.32 లక్షల విలువైన ఫర్నిచర్, ఇతర గృహోపకరణాలను కూడా కొనుగోలు చేసినట్లు వివరించారు.
అయితే నవంబర్ 20న పెళ్లి రోజన వివాహ వేదిక వద్దకు పెళ్లి ఊరేగింపుతో రావడానికి బదులుగా, వరుడు కుల్దీప్ తన తల్లితో కలిసి సాధారణ దుస్తుల్లో అక్కడికి చేరుకుని ‘బ్రెజా’ కారు కోసం వెతికినట్లు వధువు తండ్రి సుభాష్ తెలిపారు. బుకింగ్ చేసిన ఆ కారు ఇంకా సమకూరకపోవడంతో ఇరు కుటుంబాల మధ్య వాగ్వాదం జరిగినట్లు చెప్పారు. వరుడు తమ కుటుంబ సభ్యులను దూషించడంతో పాటు వధువు హీనా సోదరుడు సాహిల్‌తో గొడవకు దిగాడని సుభాష్ ఆరోపించారు. చేతులు జోడించి, వివాహ తంతును పూర్తి చేయమని కుల్దీప్ను, అతడి తల్లిని తమ బంధువులు వేడుకున్నప్పటికీ వారు వినకుండా అక్కడి నుంచి వెళ్లి పోయినట్లు ఆరోపించారు. వధువు హీనా పెళ్లి దుస్తుల్లో మండపం వద్ద కూర్చుని ఎదురుచూస్తూ ఉండిపోయిందని వాపోయారు.
కాగా, వివాహ ఏర్పాట్ల కోసం సుమారు రూ. 30 లక్షల వరకు తాను ఖర్చు చేశానని వధువు తండ్రి సుభాష్ తెలిపారు. అయితే పెళ్లి సమయానికి ‘మారుతి బ్రెజ్జా’ కారు అందుబాటులో లేకపోవడంతో వరుడు కుల్దీప్ పెళ్లిని రద్దు చేసినట్లు ఆయన ఆరోపించారు. కుల్దీప్, అతడి కుటుంబంపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ పోలీసులకు ఆయన ఫిర్యాదు చేశారు. అయితే వరుడు కుల్దీప్ కుటుంబం కూడా ప్రతిగా ఫిర్యాదు చేసింది. ఈ నేపథ్యంలో ఇరు కుటుంబాల ఫిర్యాదులపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Cop Cancels Wedding | డిమాండ్ చేసిన కారు కనిపించకపోవడంతో.. పెళ్లి రద్దు చేసిన పోలీస్ అధికారి
Health tips | పాలలో చక్కెర కలుపుకుని తాగితే అనారోగ్యమట.. చక్కెరే కాదు ఇవి కూడా కలుపొద్దట..!
కోయిల్‌సాగర్ నీటిని కొడంగల్‌కు తరలిస్తే సహించేది లేదు : మాజీ ఎమ్మెల్యే రాజేందర్ రెడ్డి
Dasoju Shravan Kumar | సీఎం రేవంత్ రెడ్డికి ఎమ్మెల్సీ దాసోజ్ శ్రవణ్ కుమార్ బహిరంగ లేఖ
Road accident | వేగంగా దూసుకెళ్తూ ట్రెయిలర్‌ను ఢీకొట్టిన కారు.. ఏడుగురు దుర్మరణం..!
ట్రెండింగ్ వార్తలు
Watch: ఆసుపత్రిలో నిద్రిస్తున్న మహిళను వేధించిన వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: వైద్య విద్యార్థినిని.. కాలేజీ క్యాంపస్ నుంచి కిడ్నాప్ చేసిన కుటుంబ సభ్యులు, వీడియో వైరల్
Vande Bharat Train | బంధువులను సాగనంపేందుకు వందే భారత్ రైలు ఎక్కిన 12 మంది.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: హాస్పిటల్ యజమానిని బెదిరించి రూ.10 లక్షలు వసూలు.. కాంగ్రెస్ నేత అరెస్ట్, పార్టీ నుంచి బహిష్కరణ
Watch: ‘బ్యాగ్‌లో గంజాయి పెడతా.. డ్రగ్స్ కేసులో ఇరికిస్తా’.. జంటను బెదిరించిన పోలీస్ అధికారి

