Dasoju Shravan Kumar | సీఎం రేవంత్ రెడ్డికి ఎమ్మెల్సీ దాసోజ్ శ్రవణ్ కుమార్ బహిరంగ లేఖ
Dasoju Shravan Kumar | ఇంటర్మీడియట్‌ను రద్దు చేసి 9 నుండి 12వ తరగతి వరకు ఒకే బడిగా మారిస్తే తెలంగాణ విద్యార్థుల స్థానికతపై రేవంత్ ప్రభుత్వం దాడి చేసినట్లేనని సీఎం రేవంత్ రెడ్డికి రాసిన బహిరంగ లేఖలో ఎమ్మెల్సీ దాసోజ్ శ్రవణ్ కుమార్ పేర్కొన్నారు
Dasoju Shravan Kumar | తెలంగాణ విద్యార్థుల స్థానికత హక్కులను కాలరాయొద్దని, స్వార్థపూరిత ఇంటర్మీడియట్ రద్దు నిర్ణయాన్ని నిలిపివేయాలని కోరుతూ ఎమ్మెల్సీ దాసోజ్ శ్రవణ్ కుమార్ సీఎం రేవంత్ రెడ్డికి బహిరంగ లేఖ రాశారు.
ఇంటర్మీడియట్‌ను రద్దు చేసి 9 నుండి 12వ తరగతి వరకు ఒకే బడిగా మారిస్తే తెలంగాణ విద్యార్థుల స్థానికతపై రేవంత్ ప్రభుత్వం దాడి చేసినట్లేనని ఆయన లేఖలో పేర్కొన్నారు. నాలుగేళ్ల కార్పొరేట్ హాస్టల్ ప్యాకేజీ కొంటే ఇతర రాష్ట్రాల విద్యార్థులు సైతం చట్టబద్ధంగా ‘తెలంగాణ లోకల్’ అయిపోయి, మన బిడ్డల మెడికల్, ఇంజనీరింగ్ సీట్లు తన్నుకుపోయే ప్రమాదం ఉందని హెచ్చరించారు.
లోకల్ హోదా పుట్టుకతో కాకుండా ప్రవేశ పరీక్షకు ముందు వరుసగా 4 ఏళ్లు ఎక్కడ చదివారనే దానిపైనే ఆధారపడి ఉంటుందని లేఖలో దాసోజ్ శ్రవణ్ కుమార్ స్పష్టం చేశారు. తెలంగాణ విద్యార్థుల భవిష్యత్తును శాశ్వతంగా దెబ్బతీసే ఈ చట్టపరమైన ఇంటర్మీడియట్ రద్దు ప్రమాదాన్ని నివారించాలని లేఖలో కోరారు.
ప్రజాప్రతినిధులు, విద్యావేత్తలు, తల్లిదండ్రులతో కనీస చర్చ లేకుండా తీసుకున్న ఇంటర్మీడియట్ రద్దు నిర్ణయం వెనుక కార్పొరేట్ కాలేజీల ప్రయోజనాలున్నాయని ఆరోపించారు. నవంబర్ 13న రాసిన తాను బహిరంగ లేఖపై వారం గడిచినా ప్రభుత్వం నుండి ఒక్క సమాధానం కూడా రాలేదని, కార్పొరేట్ సంస్థలకు లాభం చేకూర్చే ఇంటర్మీడియట్ రద్దు నిర్ణయాన్ని తక్షణమే ఉపసంహరించుకోవాలని ఎమ్మెల్సీ దాసోజ్ శ్రవణ్ కుమార్ డిమాండ్ చేశారు. ఈ విషయమై దాసోజు శ్రవణ్ కుమార్ సుదీర్ఘ అంశాలను సీఎం రేవంత్ రెడ్డికి లేఖలో ప్రస్తావించారు.
Read Also :
Ind vs Nz | వెల్లింగ్టన్ టెస్టులో భారత్ పరుగుల విధ్వంసం.. 9 వికెట్లు సాధిస్తే టీమిండియాదే గెలుపు
Suriya | ఒకే ఏడాదిలో మూడు సినిమాలతో రూ.200 కోట్ల క్లబ్.. ‘సీన్’ సక్సెస్‌పై సూర్య ఎమోషనల్ వీడియో!
Read Today's Latest Hyderabad News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Dasoju Shravan Kumar | సీఎం రేవంత్ రెడ్డికి ఎమ్మెల్సీ దాసోజ్ శ్రవణ్ కుమార్ బహిరంగ లేఖ
Road accident | వేగంగా దూసుకెళ్తూ ట్రెయిలర్‌ను ఢీకొట్టిన కారు.. ఏడుగురు దుర్మరణం..!
Medchel Flyover | బీజేపోళ్లు ఓట్లడిగితే ఈ ఫ్లైఓవర్లు చూపించాలి.. ఓ వాహనదారుడు.. వీడియో
Nitish Setu | నితీశ్ సేతుపై ఆర్జేడీ కార్యకర్తల వీరంగం.. బ్యానర్లు ధ్వంసం
The Lakshmana | వెండితెరపై లక్ష్మణుడి అజ్ఞాత వీరగాథ.. ఆకట్టుకుంటున్న ‘ది లక్ష్మణ’ ఫస్ట్ లుక్ పోస్టర్!
ట్రెండింగ్ వార్తలు
Watch: ఆసుపత్రిలో నిద్రిస్తున్న మహిళను వేధించిన వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: వైద్య విద్యార్థినిని.. కాలేజీ క్యాంపస్ నుంచి కిడ్నాప్ చేసిన కుటుంబ సభ్యులు, వీడియో వైరల్
Vande Bharat Train | బంధువులను సాగనంపేందుకు వందే భారత్ రైలు ఎక్కిన 12 మంది.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: హాస్పిటల్ యజమానిని బెదిరించి రూ.10 లక్షలు వసూలు.. కాంగ్రెస్ నేత అరెస్ట్, పార్టీ నుంచి బహిష్కరణ
Watch: ‘బ్యాగ్‌లో గంజాయి పెడతా.. డ్రగ్స్ కేసులో ఇరికిస్తా’.. జంటను బెదిరించిన పోలీస్ అధికారి

