భువనేశ్వర్: స్కూల్ టీచర్లు ఒక బాలికను లైంగికంగా వేధించారు. పలుమార్లు అత్యాచారానికి పాల్పడ్డారు. బాధిత విద్యార్థిని కుటుంబం ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేశారు. ఐదుగురు టీచర్లను అరెస్ట్ చేశారు. (School Teachers Arrested For Rape) ఒడిశాలోని కేంద్రపారా జిల్లాలో ఈ సంఘటన జరిగింది. 13 ఏళ్ల బాలిక ఒక ప్రైవేట్ స్కూల్లో ఏడో తరగతి చదువుతున్నది. అయితే ఆ స్కూల్కు చెందిన ఐదుగురు ఉపాధ్యాయులు చాలా కాలంగా ఆ విద్యార్థిని లైంగికంగా వేధిస్తున్నారు. ఆ బాలికపై పలుమార్లు అత్యాచారానికి పాల్పడ్డారు.
కాగా, బాధిత బాలిక ఈ విషయాన్ని తన కుటుంబానికి చెప్పింది. దీంతో ఫిబ్రవరి 19న ఆమె కుటుంబ సభ్యులు చైల్డ్ వెల్ఫేర్ కమిటీని ఆశ్రయించారు. ఆ కమిటీ ప్రాథమికంగా దర్యాప్తు చేసింది. బాలిక ఆరోపణలపై ప్రత్యేక దర్యాప్తు జరుపాలని పోలీసులు, జిల్లా విద్యాశాఖ అధికారిని కూడా చైల్డ్ వెల్ఫేర్ కమిటీ ఆదేశించింది.
మరోవైపు చైల్డ్ వెల్ఫేర్ కమిటీ, బాలిక తండ్రి ఫిర్యాదుపై రాజ్కనికా పోలీస్ స్టేషన్ అధికారి స్పందించారు. బాధిత బాలిక స్టేట్మెంట్ రికార్డ్ చేశారు. వైద్య పరీక్షల తర్వాత లైంగిక దాడిపై కేసు నమోదు చేశారు. నిందితులైన ఐదుగురు టీచర్లను అరెస్ట్ చేసినట్లు పోలీస్ అధికారి తెలిపారు. ఈ సంఘటనపై మరింతగా దర్యాప్తు చేస్తున్నట్లు వెల్లడించారు.
Also Read:
Bride Kidnapped At Gunpoint | నవ వరుడిని గన్తో బెదిరించి.. నవ వధువును కిడ్నాప్ చేసిన మాజీ ప్రియుడు
IIT Bombay | ఐఐటీ బాంబే హాస్టల్ రూమ్లో 5 బుల్లెట్లు.. పోలీసుల అదుపులో బీహార్ వ్యక్తి