ఆదిలాబాద్ : రేవంత్ రెడ్డి పాలనలో విద్యాలయాలు మృత్యుకూపాలుగా మారుతున్నాయి. రాష్ట్ర వ్యాప్తంగా ఏదో ఒక చోట విద్యార్థులు బలవన్మరణానికి పాల్పడుతున్నారు. తాజాగా బాసర ట్రిబుల్ఐటీలో ఇంజినీరింగ్ మొదటి సంవత్సరం చదువుతున్న ఆర్.వసంత అనే విద్యార్థిని ఆత్మహత్య చేసుకున్నట్టు సమాచారం.
మృతురాలిది స్వస్థలం వనపర్తి జిల్లాగా గుర్తించారు. అధికారులు మృతదేహాన్ని గుట్టు చప్పుడు కాకుండా బైంసా ఏరియా హాస్పిటల్కు తరలించారు. ఆత్మహత్య గల కారణాలు తెలియాల్సి ఉంది.