Maize Procurement Scam | నమస్తే తెలంగాణలో వరుస కథనాలకు స్పందన.. మక్కల కొనుగోళ్లపై విచారణ షురూ
బాదేపల్లి పీఏసీఎస్‌లో గత యాసంగిలో జరిగిన మక్కజొన్న కొనుగోళ్ల అవకతవకలపై అధికారులు విచారణ ప్రారంభించారు. ‘నమస్తే తెలంగాణ’లో వస్తున్న వరుస కథనాలకు ఉన్నతాధికారులు స్పందించి గురువారం బాదేపల్లి పీఏసీసీఎస్‌లో విచారణ జరిపారు.
Maize Procurement Scam | మహబూబ్‌నగర్, జూలై 23 (నమస్తే తెలంగాణ ప్రతినిధి) : బాదేపల్లి పీఏసీఎస్‌లో గత యాసంగిలో జరిగిన మక్కజొన్న కొనుగోళ్ల అవకతవకలపై అధికారులు విచారణ ప్రారంభించారు. ‘నమస్తే తెలంగాణ’లో వస్తున్న వరుస కథనాలకు ఉన్నతాధికారులు స్పందించి గురువారం బాదేపల్లి పీఏసీసీఎస్‌లో విచారణ జరిపారు. రైతులు పండించిన పంటను పీఏసీసీఎస్ చైర్మన్ తన గోదాముకు తరలించి భారీ ఎత్తున రైతులకు టోపీ పెట్టినట్టు ఆరోపణలు వచ్చాయి.
రైతులు ఆందోళనకు దిగినా అధికారులు స్పందించలేదు. దీంతో ‘నమస్తే తెలంగాణ’లో ‘మక్కలు బుక్కిన కాంగ్రెస్ నేత’ అనే శీర్షిక వచ్చిన కథనం సంచలనం సృష్టించింది. కలెక్టర్ స్పందించి విచారణకు ఆదేశించినట్టు తెలిసింది. జిల్లా సహకార సంఘం అధికారి కృష్ణ, సివిల్ సరఫరా అధికారి గణప శ్రీనివాస్, మార్క్‌ఫెడ్ డీఎం తహ్మీనాతోపాటు హార్టికల్చర్‌శాఖ ఆఫీసర్లు గురువారం కార్యాలయానికి వచ్చి మధ్యాహ్నం వరకు విచారణ జరిపారు.
కాగా విచారణ సమయంలో పీఏసీసీఎస్ చైర్మన్ అక్కడే ఉండడం పలు అనుమానాలకు తావిస్తున్నది. కాగా బాదేపల్లి పీఏసీసీఎస్‌లో జరిగిన అక్రమాలపై విచారణ జరుపాలని ఏకంగా సీఈవో యాదగిరి జిల్లా కలెక్టర్‌కు లిఖితపూర్వకంగా ఫిర్యాదు చేయడం గమనార్హం. గోదాములకు తరలించాల్సిన బస్తాలను నిబంధనలకు విరుద్ధంగా చైర్మన్ తన సొంత గోదాముకు 53,976 బస్తాలను తీసుకువెళ్లారని తెలిపారు. తీరా 53,119 బస్తాలు మాత్రమే రావడంతో 857బస్తాలు పక్కదారి పట్టినట్టు సీఈవో తన ఫిర్యాదులో ఆరోపించారు.
మార్క్‌ఫెడ్ డీఎం సస్పెన్షన్
మక్కజొన్న కొనుగోళ్లలో బాదేపల్లి పీఏసీఎస్ చైర్మన్‌కు సహకరించిన మహబూబ్‌నగర్ మార్క్‌ఫెడ్ డీఎం తహ్మీనాను గురువారం సాయం త్రం అధికారులు సస్పెండ్ చేశారు. రైతుల నుంచి కొనుగోలు చేసిన మక్కజొన్నల్లో అవకతవకలకు పాల్పడినట్టు రుజువు కావడంతో ఆ శాఖ ఎండీ సస్పెన్షన్ ఉత్తర్వులు జారీచేశారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
దూదేకుల స్థితిగతులపై ప్రత్యేక సర్వే
ఖాళీలు 2,125.. భర్తీ 429 మాత్రమే.. యూనివర్సిటీల్లో టీచింగ్ పోస్టుల భర్తీపై సర్కార్ నిర్లక్ష్యం
India vs Zimbabwe | షఫాలీ సునామీ.. స్మృతి మంధాన మెరుపు ఫినిషింగ్.. 8.5 ఓవర్లలోనే జింబాబ్వేపై టీమిండియా విధ్వంసం!
Bathukamma | రాష్ట్రంలో ఘనంగా బతుకమ్మ సంబరాలు.. Videos
Bathukamma | పండుగ పూట కరెంట్ కోతలు.. చీకట్లోనే బతుకమ్మ ఆడిన మహిళలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

