మక్కజొన్న కొనుగోళ్ల విషయంలో రాష్ట్ర ప్రభుత్వం అనుసరిస్తున్న వైఖరి తీవ్ర విమర్శలకు దారితీస్తున్నది. రైతులు పండించిన మక్కజొన్నల్లో ప్రభుత్వం సగమే కొనుగోలు చేస్తూ మిగిలిన సగం పంటకు కోత విధిస్తున్నది.
మక్కల కొనుగోలు కేంద్రాలతో రైతులకు ఎంతో మేలు జరుగుతుందని రైతు ఐక్యవేదిక రాష్ట్ర అధ్యక్షుడు శేర్ నర్సారెడ్డి పేర్కొన్నారు. శుక్రవారం ఆయన జగిత్యాల జిల్లా మెట్పల్లిలో మీడియాతో మాట్లాడారు.