Pawan Kalyan | పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న ‘ఉస్తాద్ భగత్ సింగ్’ చిత్రం విడుదలకు సిద్ధమైంది. హరీష్ శంకర్ దర్శకత్వంలో రూపొందిన ఈ భారీ మాస్ యాక్షన్ ఎంటర్టైనర్ నేడు సెన్సార్ కార్యక్రమాలను పూర్తి చేసుకుంది. సెన్సార్ బోర్డు ఈ చిత్రానికి ‘U/A’ సర్టిఫికేట్ జారీ చేసినట్లు చిత్రబృందం ప్రకటించింది. గతంలో పవన్ నటించిన ‘OG’ చిత్రానికి గ్యాంగ్‌స్టర్ డ్రామా కారణంగా ‘A’ సర్టిఫికేట్ రాగా, ఈసారి ‘ఉస్తాద్’ కు ‘U/A’ రావడంతో కుటుంబ ప్రేక్షకులందరూ కలిసి చూసే అవకాశం లభించబోతుంది. మరోవైపు ఈ సినిమా మొత్తం 2 గంటల 29 నిమిషాల రన్ టైమ్‌తో రాబోతుందని సమాచారం. ప్రస్తుత కాలంలో వస్తున్న భారీ సినిమాలతో పోలిస్తే, ఈ కాంపాక్ట్ నిడివి సినిమాకు ప్లస్ అవుతుందని విశ్లేషకులు భావిస్తున్నారు. ఎక్కడా బోర్ కొట్టకుండా పక్కా కమర్షియల్ ప్యాకేజీతో హరీష్ శంకర్ ఈ చిత్రాన్ని తెరకెక్కించినట్లు తెలుస్తోంది.
పవన్ కళ్యాణ్, శ్రీలీల, రాశీ ఖన్నా ప్రధాన పాత్రలో నటిస్తుండగా.. మైత్రీ మూవీ మేకర్స్ నిర్మిస్తుంది. దేవిశ్రీ ప్రసాద్ అందించిన పాటలకు ఇప్పటికే భారీ రెస్పాన్స్ వస్తుండగా, తమన్ బ్యాక్ గ్రౌండ్ స్కోర్ సినిమాను మరో లెవల్‌కు తీసుకువెళ్తుందని ఫ్యాన్స్ ఆశిస్తున్నారు.
#UstaadBhagatSingh gets a U/A certificate ❤🔥
This summer, families are set for a blast in theatres with wholesome entertainment 💥💥
GRAND RELEASE WORLDWIDE this Ugadi – 19th MARCH, 2026 🔥#UBSOnMarch19th
POWER STAR @PawanKalyan @harish2you @sreeleela14 #RaashiiKhanna… pic.twitter.com/9dVDWM9loK
— Mythri Movie Makers (@MythriOfficial) March 10, 2026