Collar Ey Etthara | పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న ‘ఉస్తాద్ భగత్ సింగ్’ చిత్రం నుంచి అదిరిపోయే అప్డేట్ వచ్చేసింది. హరీష్ శంకర్ దర్శకత్వంలో మైత్రీ మూవీ మేకర్స్ నిర్మిస్తున్న ఈ భారీ చిత్రం నుంచి మూడవ పాట కాలర్ ఏ ఎత్తరా (Collar Ey Etthara) సాంగ్ ప్రోమోను ఈరోజు చిత్ర యూనిట్ విడుదల చేసింది. రాక్‌స్టార్ దేవిశ్రీ ప్రసాద్ కంపోజ్ చేసిన ఈ మాస్ బీట్‌కు ఎనర్జిటిక్ సింగర్ రామ్ మిరియాల గానం తోడవగా, శ్యామ్ ప్రసాద్ అందించిన లిరిక్స్ ఫ్యాన్స్‌లో పూనకాలు తెప్పిస్తున్నాయి. ఈ ప్రోమోలో పవన్ కళ్యాణ్ తన మార్క్ స్వాగ్తో అదిరిపోయే హుక్ స్టెప్ వేస్తూ కనిపించడంతో సోషల్ మీడియాలో ఈ వీడియో క్షణాల్లో వైరల్ అవుతుంది. దీనికి సంబంధించిన పూర్తి పాటను మార్చి 12వ తేదీ సాయంత్రం 5 గంటలకు గ్రాండ్‌గా లాంచ్ చేయబోతున్నారు మేకర్స్.