ENG vs PAK : ఎడ్జ్‌బాస్టన్ టెస్టులోనూ ఇంగ్లండ్ జయభేరి మోగించింది. స్వల్ప ఛేదనలో ఓపెనర్లు డకౌటైనా కెప్టెన్ జో రూట్(62 నాటౌట్), జోర్డాన్ కాక్స్(59 నాటౌట్) కీలక భాగస్వామ్యంతో పాక్ ఆశలపై నీళ్లు చల్లారు. మొహమ్మద్ అబ్బాస్(2-27) నిప్పులు చెరిగినా.. ఈ జోడీ నింపాదిగా ఆడడడంతో ఆతిథ్య జట్టు 8 వికెట్ల తేడాతో విక్టరీ కొట్టింది. వరసగా మూడు మ్యాచుల్లో గెలుపొందిన ఇంగ్లండ్ 3-0తో సిరీస్‌ను కైవసం చేసుకుంది.
స్వదేశంలో ఇంగ్లండ్ పంజా విసిరింది. మూడు టెస్టుల సిరీస్‌లో సంపూర్ణ ఆధిపత్యంతో పాకిస్థాన్‌ను క్లీన్‌స్వీప్ చేసింది. ఎడ్జ్‌బాస్టన్‌లో తొలిరోజు నుంచే పట్టుబిగించిన ఇంగ్లండ్.. నాలుగో రోజే మ్యాచ్‌ను ముగించింది. రెండో ఇన్నింగ్స్‌లో పాక్‌ను 449 పరుగులకే కట్టడి చేసి.. అనంతరం 130 పరుగుల ఛేదనకు దిగిన ఆ జట్టు ఇన్నింగ్స్ మొదటి ఓవర్లోనే ఓపెనర్లను కోల్పోయింది.
Mohammad Abbas gave England an early scare, but Joe Root and Jordan Cox scored fifties to get the job done and seal a 3-0 series sweep 🏴 #ENGvPAK pic.twitter.com/zQ0RLVkiOz
— Cricinfo (@cricinfo) September 12, 2026
పాకిస్థాన్ పేసర్ మొహమ్మద్ అబ్బాస్(2-20) ఓవర్లో తొలి బంతికి డకెట్(0) వికెట్ కీపర్ చేతికి చిక్కగా.. ఆఖరి బంతికి ఎమిలియో గే(0)ను ఎల్బీగా వెనుదిరిగాడు. అబ్బాస్ విజృంభనతో సున్నాకే రెండు వికెట్లు పడినా కెప్టెన్ జో రూట్(62 నాటౌట్), జోర్డాన్ కాక్స్(59 నాటౌట్) లు ఒత్తిడికి లోనవ్వలేదు. 23 పరుగుల వద్ద బౌల్డయ్యాడు. కానీ, అది నో బాల్ కావడంతో రూట్ బతికిపోయాడు. పాక్ పేసర్లను ధీటుగా ఎదుర్కొన్న ఈ ద్వయం శతక భాగస్వామ్యం నెలకొల్పగా ఆతిథ్య జట్టు 8 వికెట్ల తేడాతో గెలిచింది. తద్వారా 3-0తో సిరీస్‌ను కైవసం చేసుకుంది ఇంగ్లండ్.
Half-centuries from Joe Root and Jordan Cox guide England to a 3-0 series win over Pakistan 🏴✅ pic.twitter.com/sWVLD5u52K
— Sky Sports Cricket (@SkyCricket) September 12, 2026
ఎడ్జ్‌బాస్టన్‌లో ఇప్పటివరకూ ఒక్క మ్యాచూ గెలవని పాక్ ఈసారి కూడా అదే తడబాటుతో మూల్యం చెల్లించుకుంది. ఇక బెన్ స్టోక్స్ వీడ్కోలు తర్వాత మళ్లీ కెప్టెన్సీ చేపట్టిన రూట్ తొలి సిరీస్‌ను ఒడిసిపట్టాడు. డాన్ లారెన్స్ ‘ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్’గా, ఓలీ రాబిన్సన్ ‘ప్లేయర్ ఆఫ్ ది సిరీస్’గా ఎంపికయ్యారు.