Dancer Raju | పాపులర్ తెలుగు డ్యాన్స్ రియాలిటీ షో ‘ఢీ10’ విన్నర్, డ్యాన్సర్ రాజును లైంగిక వేధింపుల కేసులో పోలీసులు అరెస్ట్ చేశారు. డ్యాన్సర్ రాజు సినిమా అవకాశాల పేరుతో తనను లైంగికంగా వేధించాడంటూ ఓ యువతి మియాపూర్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసింది. యువతి ఫిర్యాదు ఆధారంగా విచారణ చేపట్టిన పోలీసులు ప్రాథమిక ఆధారాలు సేకరించిన తర్వాత ఈ నెల 9వ తేదీన రాజుపై కేసు నమోదు చేసినట్టు సమాచారం.
కేసు నమోదు చేసిన వెంటనే రాజును అరెస్ట్ చేసిన పోలీసులు న్యాయమూర్తి ఎదుట హాజరుపరిచారు. కేసు వివరాలు పరిశీలించిన న్యాయస్థానం డ్యాన్సర్ రాజుకు రిమాండ్ విధించింది. దీంతో అతన్ని పోలీసులు వెంటనే రిమాండ్కు తరలించారు. కేసు నమోదై 3 రోజులవుతున్నా మియాపూర్ పోలీసులు ఈ వ్యవహారాన్ని బయటకు రానివ్వకపోవడం చర్చనీయాంశంగా మారింది.

Brahmotsavams | ఏపీ సీఎంకు శ్రీవారి బ్రహ్మోత్సవాల ఆహ్వాన పత్రిక అందజేత