Cannabis Seized | నగరంలో 21 కిలోల ఎండు గంజాయి స్వాధీనం.. నలుగురు అరెస్ట్
Cannabis Seized | నగరంలో ఎండు గంజాయిని విక్రయిస్తున్న నలుగురు సభ్యులు గల ముఠాను హబీబ్ నగర్ పోలీసులు పట్టుకున్నారు.
హైదరాబాద్ : నగరంలో ఎండు గంజాయిని ( Cannabis ) విక్రయిస్తున్న నలుగురు సభ్యులు గల ముఠాను హబీబ్ నగర్ పోలీసులు ( Police ) పట్టుకున్నారు. వారి వద్ద నుంచి 21 కిలోల గంజాయిని, రూ. 25వేల నగదును స్వాధీనం చేసుకున్నామని ఆసిఫ్‌నగర్ డివిజన్ అసిస్టెంట్ పోలీస్ కమిషనర్ కె శ్రీనివాస్ ( Srinivas ) వెల్లడించారు. ఈ కేసులో నలుగురు నిందితులను అరెస్టు ( Arrest ) చేశామని వివరించారు.
మహారాష్ట్రకు చెందిన సందీప్ నంద కిషోర్, రాహుల్ రాజేశ్ పాటిల్ అనే ఇద్దరు యువకులు మహారాష్ట్రలో తక్కువ ధరకు గంజాయి కొనుగోలు చేసి హైదరాబాద్‌లోని మంగల్బస్తీకి చెందిన కాంబ్లె ఉమేశ్, కాంబ్లె సూరజ్‌కు అధిక ధరకు విక్రయిస్తున్నారని తెలిపారు. అందిన పక్కా సమాచారం మేరకు హబీబ్‌నగర్‌లో నిఘా పెట్టి గంజాయిని విక్రయిస్తుండగా నలుగురిని పట్టుకున్నామని పేర్కొన్నారు.
వీరిపై ఎన్డీపీఎస్ చట్టం కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని, అయితే దర్యాప్తులో నిందితుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని అన్నారు. గంజాయి ముఠాను పట్టుకోవడంలో కృషి చేసిన పోలీసు అధికారులను, సిబ్బందిని అభినందించారు.
Read Today's Latest Hyderabad News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Medak | కేసీఆర్ మరోసారి సీఎంగా బాధ్యతలు చేపడితేనే తెలంగాణకు మోక్షం
Motorola | మోటరోలా నుంచి మరో ఫోల్డబుల్ ఫోన్.. పేరు, ఫీచర్లు లీక్.. ఎప్పుడొస్తుందంటే?
Suspicious Death | అమెరికాలో జగిత్యాల జిల్లా యువకుడు అనుమానాస్పద స్థితిలో మృతి
AP SEO | పట్టణ ప్రాంతాల్లో ఎన్నికల కోడ్ ఎత్తివేత : ఏపీ ఎస్ఈవో
Triptii Dimri | బ్లాక్ అవుట్‌ఫిట్‌లో బ్యూటీ క్వీన్ త్రిప్తి దిమ్రి అందాల విందు
ట్రెండింగ్ వార్తలు
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి

