Rains | రాష్ట్రంలో మరో మూడు రోజులపాటు వర్షాలు.. హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడి
Rains | రాష్ట్రంలో వర్షాలు కొనసాగుతున్నాయని, ఇప్పట్లో ఈ వర్షాలు తగ్గే సూచనలు కనిపించడం లేదని, రాష్ట్రవ్యాప్తంగా మరో వారం రోజులపాటు తేలికపాటి నుంచి మోస్తరు వానలు పడే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించింది. రానున్న 24 గంటల్లో పలు జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంటూ హెచ్చరికలు జారీచేసింది.
Rains : రాష్ట్రంలో వర్షాలు కొనసాగుతున్నాయని, ఇప్పట్లో ఈ వర్షాలు తగ్గే సూచనలు కనిపించడం లేదని, రాష్ట్రవ్యాప్తంగా మరో వారం రోజులపాటు తేలికపాటి నుంచి మోస్తరు వానలు పడే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించింది. రానున్న 24 గంటల్లో పలు జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంటూ హెచ్చరికలు జారీచేసింది. ముఖ్యంగా ములుగు, జయశంకర్ భూపాలపల్లి, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, ఆదిలాబాద్, కుమరం భీం ఆసిఫాబాద్ జిల్లాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అంచనా వేస్తోంది.
నిర్మల్, జగిత్యాల, నిజామాబాద్ జిల్లాల్లోని పలు ప్రాంతాల్లోనూ భారీ వర్షాలు కురిసే సూచనలు కనిపిస్తున్నాయని వాతావరణ కేంద్రం తెలిపింది. వీటితోపాటు నల్గొండ, నాగర్‌కర్నూల్, మహబూబ్‌నగర్, నారాయణపేట, సంగారెడ్డి, మెదక్, సిద్దిపేట జిల్లాల్లో అక్కడక్కడా మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొన్నది. హైదరాబాద్ నగరంలోనూ మోస్తరు వర్షాలు పడే సూచనలు ఉన్నాయని తెలిపింది. వర్షాల నేపథ్యంలో ఉష్ణోగ్రతలు తగ్గడం, గాలిలో తేమ శాతం పెరగడం వల్ల సీజనల్ వ్యాధులు ప్రబలే ప్రమాదం ఉందని రాష్ట్ర ప్రజారోగ్య శాఖ హెచ్చరించింది.
ప్రధానంగా దోమలు, కలుషిత నీరు, గాలి ద్వారా వ్యాపించే అంటువ్యాధుల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించింది. దోమతెరలు వాడటం, నివాస పరిసరాల్లో నీరు నిల్వ ఉండకుండా జాగ్రత్త పడటం, కాచి చల్లార్చిన నీటిని మాత్రమే తాగడం వంటి ముందస్తు జాగ్రత్తలు పాటించాలని కోరింది. ఎవరికైనా ఫ్లూ లక్షణాలు కనిపిస్తే జాప్యం చేయకుండా వెంటనే వైద్యులను సంప్రదించాలని అధికారులు స్పష్టం చేశారు.
Read Today's Latest News News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ఎక్కడి స్తంభాలు అక్కడే!
ఏఐ దెబ్బ.. ‘గెట్టి ఇమేజెస్’ దివాలా
India vs Zimbabwe | హర్మన్‌ప్రీత్, దీప్తి శర్మ శతకాల మోత.. జింబాబ్వేపై భారత్ ఘన విజయం.. సిరీస్ కైవసం
Vehicle Emissions | వాహన ఉద్గారాలపై నియంత్రణ ఎందుకు.. ఆరోగ్యంపై ఎలాంటి ప్రభావం ఉంటుంది..?
Saudi Arabia | సౌదీ అరేబియాపై డ్రోన్లు, మిస్సైల్స్ దాడి.. ఆ వీడియోలు షేర్ చేయొద్దంటూ భారతీయులకు వార్నింగ్
ట్రెండింగ్ వార్తలు
Watch: లోయలోకి దూసుకెళ్లిన బస్సు.. ప్రయాణికులు ఏం చేశారంటే?
Amur Falcons | ఏకంగా 23 దేశాలను చుట్టి మణిపూర్‌కు తిరిగొచ్చిన అమూర్ ఫాల్కన్స్..!
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య

