ఖైరతాబాద్, డిసెంబర్ 12 : వ్యాపారం పేరుతో తనను రూ.1.89 కోట్లకు మోసం చేశారని కర్ణాటకలోని (Karnataka) చిక్బళ్లాపూర్కు చెందిన మక్కజొన్న వ్యాపారి రామకృష్ణ వాపోయారు.
శుక్రవారం సోమాజిగూడ ప్రెస్‌క్లబ్‌లో మీడియాతోఆయన మాట్లాడుతూ.. తాను రైతుల నుంచి ఙక్కజొన్నలు కొనుగోలు చేసి హోల్‌సేల్‌గా విక్రయిస్తుంటానని, ఇదేక్రమంలో హైదరాబాద్‌లోని ఆరాంఘర్‌కు చెందిన అక్బర్, నాసిర్, అహ్మద్‌లకు తొమ్మిది లారీల మొక్కజొన్నలు సరఫరా చేసినట్టు తెలిపారు. డబ్బులు ఇవ్వకుండా బెదిరింపులకు పాల్పడుతున్నారని ఆరోపించారు.