Allu Arjun | రాజకీయాల్లోకి అల్లు అర్జున్.. క్లారిటీ ఇచ్చిన మేనేజర్
Allu Arjun | ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ రాజకీయాల్లోకి రానున్నారంటూ గత కొంతకాలంగా సోషల్ మీడియాలో, సినీ వర్గాల్లో జోరుగా ప్రచారం జరుగుతోంది. ముఖ్యంగా ఆయన మామయ్య కాంగ్రెస్ పార్టీలో కీలక నేతగా ఉండటంతో ఈ వార్తలకు మరింత ఊతం లభించింది. అయితే ఈ ప్రచారంపై తాజాగా అల్లు అర్జున్ మేనేజర్ శరత్ చంద్ర నాయుడు స్పష్టత ఇచ్చారు.
Allu Arjun | ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ రాజకీయాల్లోకి రానున్నారంటూ గత కొంతకాలంగా సోషల్ మీడియాలో, సినీ వర్గాల్లో జోరుగా ప్రచారం జరుగుతోంది. ముఖ్యంగా ఆయన మామయ్య కాంగ్రెస్ పార్టీలో కీలక నేతగా ఉండటంతో ఈ వార్తలకు మరింత ఊతం లభించింది. అయితే ఈ ప్రచారంపై తాజాగా అల్లు అర్జున్ మేనేజర్ శరత్ చంద్ర నాయుడు స్పష్టత ఇచ్చారు. ఒక ఇంటర్వ్యూలో మాట్లాడిన శరత్ చంద్ర నాయుడు, అల్లు అర్జున్ రాజకీయాల్లోకి వస్తున్నారనే వార్తలను పూర్తిగా ఖండించారు. ఇలాంటి ప్రచారం అంతా ఫేక్ న్యూస్ మాత్రమేనని స్పష్టం చేశారు.
ఈ వార్తలు సోషల్ మీడియాలో వచ్చిన వెంటనే నేను వాటికి నేరుగా స్పందించాను. అవన్నీ అవాస్తవ ప్రచారాలే. ప్రస్తుతం అల్లు అర్జున్ దృష్టి పూర్తిగా సినిమాలపైనే ఉంది. ఆయన భారతదేశంలోనే అత్యంత బిజీగా ఉన్న స్టార్ హీరోల్లో ఒకరు. ఇలాంటి సమయంలో ఆయన సినిమాలను పక్కన పెట్టి రాజకీయాల్లోకి రావాల్సిన అవసరం ఏముంది? అని శరత్ చంద్ర నాయుడు అన్నారు. అలాగే, అల్లు అర్జున్ తన కెరీర్లో అత్యంత కీలకమైన దశలో ఉన్నారని, ఇప్పటికే పలు భారీ పాన్ ఇండియా ప్రాజెక్టులకు కమిట్ అయ్యారని తెలిపారు. రాబోయే దాదాపు పదేళ్ల పాటు ఆయన షెడ్యూల్ సినిమాలతోనే బిజీగా ఉంటుందని, అలాంటి పరిస్థితిలో రాజకీయాల గురించి ఆలోచించే అవకాశం లేదని వెల్లడించారు.
అల్లు అర్జున్ మామయ్య ద్వారా రాజకీయాల్లోకి ఎంట్రీ ఇస్తారనే ప్రచారాన్ని కూడా ఆయన ఖండించారు. అలాంటి వార్తలకు ఎలాంటి ఆధారాలు లేవని, కేవలం సోషల్ మీడియాలో జరుగుతున్న ఊహాగానాలేనని చెప్పారు. ప్రస్తుతం అల్లు అర్జున్ వరుస పాన్ ఇండియా చిత్రాలతో బిజీగా ఉన్నారు. దేశవ్యాప్తంగా భారీ అంచనాలు ఉన్న పలు ప్రాజెక్టులు ఆయన చేతిలో ఉండటంతో, పూర్తి దృష్టిని సినిమాలపైనే కేంద్రీకరించారని శరత్ చంద్ర నాయుడు తెలిపారు. దీంతో ఐకాన్ స్టార్ రాజకీయాల్లోకి వస్తున్నారనే ప్రచారానికి తాత్కాలికంగా తెరపడినట్టే అయింది. ప్రస్తుతం అల్లు అర్జున్ రాజకీయాల్లోకి వచ్చే ఆలోచన లేదని, ఆయన ప్రాధాన్యం పూర్తిగా సినీ కెరీర్కే పరిమితమైందని ఆయన మేనేజర్ స్పష్టం చేశారు.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Kalpavruksha Vahanam | కల్పవృక్ష వాహనంపై శ్రీ మలయప్పస్వామి దర్శనం..తిరుమలలో వైభవంగా బ్రహ్మోత్సవాలు
Lover | ప్రియుడికి బెయిల్ ఇప్పించేందుకు ప్రియురాలు ఏం చేసిందో తెలుసా..?
Jailer 2 Review | ‘జైలర్ 2’ మూవీ రివ్యూ.. రజనీ మార్క్ యాక్షన్ ఎలా ఉందంటే!
Pakistan School: పాకిస్థాన్ స్కూల్లో కూలిన పైకప్పు.. 28 మంది విద్యార్థులు మృతి
Abhijeet Dipke: సీజేపీకి అమెరికా నిధులు.. సింగర్ మిల్బెన్కు దీప్కే కౌంటర్
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్పై ప్రభావం ఉంటుందా..?

