న్యూఢిల్లీ, జూలై 23: హింసాత్మక నిరసనల్లో పాల్గొన్న వారిపై కఠిన వైఖరిని అవలంబించేందుకు ఢిల్లీ పోలీసులు సంసిద్ధమవుతున్నారు. ఇప్పటికే ఉన్న చట్టాల ప్రకారం చర్యలు తీసుకోవడంతోపాటు అల్లర్లలో పాల్గొన్నట్లు తేలిన వ్యక్తులపై పోలీసులు పాస్పోర్ట్ రద్దు ప్రక్రియలను కూడా ప్రారంభిస్తారు.
కాక్రోచ్ జనతా పార్టీ(సీజేపీ) ఈనెల 20న చలో పార్లమెంట్ మార్చ్ సందర్భంగా పార్లమెంట్ చుట్టూ ఉన్న భద్రతా బారికేడ్లను నిరసనకారులు ఛేదించేందుకు ప్రయత్నించడంతో చెలరేగిన హింస నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నారు. దీంతో భద్రతా దళాలు బాష్పవాయువు ప్రయోగించడం, లాఠీచార్జ్లకు పాల్పడటం, అల్లర్ల నిరోధక వాహనాలను మోహరించడం వంటివి చేశాయి.