Tamannah | టాలీవుడ్లో స్టార్ హీరోయిన్,బాలీవుడ్లో మాత్రం వరుస షాకులు.. తమన్నా ఖాతాలో మరో డిజాస్టర్!
Tamannah | ముంబై నుంచి వచ్చి టాలీవుడ్లో స్టార్ హీరోయిన్గా తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న నటి తమన్నా భాటియా. తెలుగు సినిమాలతోనే అగ్ర కథానాయికగా ఎదిగిన ఆమెకు ప్రేక్షకులు ముద్దుగా ‘మిల్కీ బ్యూటీ’ అనే ట్యాగ్ ఇచ్చారు. అప్పట్లో స్టార్ హీరోల సరసన వరుస అవకాశాలు అందుకున్న తమన్నా.. దక్షిణాది సినిమాల్లో తన కెరీర్ను బలంగా నిర్మించుకున్నారు.
Tamannah | ముంబై నుంచి వచ్చి టాలీవుడ్లో స్టార్ హీరోయిన్గా తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న నటి తమన్నా భాటియా. తెలుగు సినిమాలతోనే అగ్ర కథానాయికగా ఎదిగిన ఆమెకు ప్రేక్షకులు ముద్దుగా ‘మిల్కీ బ్యూటీ’ అనే ట్యాగ్ ఇచ్చారు. అప్పట్లో స్టార్ హీరోల సరసన వరుస అవకాశాలు అందుకున్న తమన్నా.. దక్షిణాది సినిమాల్లో తన కెరీర్ను బలంగా నిర్మించుకున్నారు. అయితే బాలీవుడ్లో మాత్రం హీరోయిన్గా ఆమెకు ఆశించిన స్థాయిలో విజయాలు దక్కడం లేదనే చర్చ జరుగుతోంది. తాజాగా సిద్ధార్థ్ మల్హోత్రా హీరోగా నటించిన ‘ది వాన్’ సినిమాలో తమన్నా కథానాయికగా కనిపించారు. అయితే ఈ సినిమాకు ఆశించిన స్థాయిలో స్పందన రాలేదని సినీ విశ్లేషకుల సమీక్షలు పేర్కొంటున్నాయి. ముఖ్యంగా సినిమాలో తమన్నా పాత్రకు పెద్దగా ప్రాధాన్యం లేదనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. కథ మొత్తం హీరో చుట్టూ తిరుగుతుండగా, తమన్నా పాత్ర పరిమితంగానే కనిపించిందనే కామెంట్లు వినిపిస్తున్నాయి.
‘ది వాన్’ కథ విషయానికి వస్తే.. సిద్ధార్థ్ మల్హోత్రా ఇందులో నాస్తికుడైన వ్యక్తి పాత్రలో కనిపించారు. అడవిలో తమ కుటుంబానికి సంబంధించిన స్థలం విషయంలో అన్నదమ్ముల మధ్య వివాదం తలెత్తడంతో హీరో తన సొంతూరికి వెళ్తాడు. ఆ ప్రాంతంలో రాత్రివేళ అడవిలోకి వెళ్తే వనదేవత ఆగ్రహిస్తుందనే నమ్మకం ఉంటుంది. అలాంటి నమ్మకాలను విశ్వసించని హీరో ఎదుర్కొనే పరిస్థితుల చుట్టూ సినిమా కథ సాగుతుంది. ఇందులో తమన్నా హీరో భార్యగా నటించారు. అయితే ఈ సినిమాలో తమన్నా పాత్రకు కథలో పెద్దగా ప్రాధాన్యం లేదని కొందరు విమర్శకులు అభిప్రాయపడుతున్నారు. సినిమాలో ఆమె కనిపించే పాటకు మాత్రం మంచి స్పందన వస్తోందని చెబుతున్నారు. కానీ కథానాయికగా ఆమె నటన గురించి పెద్దగా చర్చ జరగడం లేదనే కామెంట్లు వినిపిస్తున్నాయి.
ఇక తమన్నా బాలీవుడ్ కెరీర్ను పరిశీలిస్తే.. ప్రత్యేక పాటల విషయంలో మాత్రం ఆమెకు మంచి విజయాలు దక్కాయి. ‘స్త్రీ 2’, ‘రైడ్ 2’ వంటి సినిమాల్లో ఆమె చేసిన ప్రత్యేక పాటలు ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి. అయితే పూర్తి స్థాయి కథానాయికగా చేసిన సినిమాలు మాత్రం వరుసగా నిరాశపరిచిన పరిస్థితి కనిపిస్తోంది. ‘లస్ట్ స్టోరీస్ 2’లో విజయ్ వర్మతో కలిసి నటించిన తమన్నా అప్పట్లో రొమాంటిక్ సన్నివేశాలతో వార్తల్లో నిలిచారు. ఆ తర్వాత ‘ప్లాన్ ఎ ప్లాన్ బి’, ‘బబ్లీ బౌన్సర్’ వంటి ప్రాజెక్టులు కూడా ఆశించిన స్థాయిలో విజయాన్ని అందుకోలేకపోయాయి. ఇప్పుడు ‘ది వాన్’ కూడా అదే జాబితాలో చేరిందనే చర్చ మొదలైంది.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Vijay Sethupathi | అంతర్జాతీయ వేదికపై అరుదైన ఘనత.. ఎమ్మీ అవార్డ్స్ ప్రెజెంటర్గా విజయ్ సేతుపతి!
Vega Jewellers: దిల్సుఖ్నగర్లో వేగా జ్యువెలర్స్ కొత్త షోరూమ్ ప్రారంభం
Diwali Firecracker Sales | దీపావళి వేళ అనుమతల్లేకుండానే టపాసుల వ్యాపారం.. ఆందోళనలో లైసెన్సుదారులు
Salman Khan | రూ.4 వేల కోట్ల బడ్జెట్ కాదు,రాముడు, సీత పాత్రల గొప్పతనంపై మాట్లాడాలి.. ‘రామాయణం’పై సల్మాన్ ఖాన్ ఆసక్తికర వ్యాఖ్యలు!
Mammootty | ఏడేళ్ల తర్వాత తమిళంలో నటిస్తున్నా.. ‘ఓం’ ప్రీ రిలీజ్ ఈవెంట్లో మమ్ముట్టి!
ట్రెండింగ్ వార్తలు
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి
Viral dance | ఆఫీస్ దీపావళి వేడుకల్లో యువతి డ్యాన్స్.. ఇంటర్నెట్లో ఏకంగా రెండు కోట్ల వ్యూస్.. Video
Watch: శివసేన నేత ఇంట్లో డ్రగ్స్ ఉంచిన పోలీస్ అధికారి.. తర్వాత ఏం జరిగిందంటే?
Viral news | ఆ ఇంట్లో రోజూ నాగుపాముల కలకలం.. ఏడ వెతికినా పాము గుడ్లే..!
Viral News | అనారోగ్యంతో ఉన్న అమ్మకోసం కేంద్ర మాజీ మంత్రి వేణుగానం..!

